Best Web Hosting Provider In India 2024

Animal Movie 15 days Box Office Collections: బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా కలెక్షన్ల హోరు ఇంకా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఇంకా పరుగులు పెడుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రారంభం నుంచి వసూళ్లలో జోరు చూపింది. చాలా రికార్డులను బద్దలుకొట్టింది. తాజాగా మరో మైలురాయికి యానిమల్ కలెక్షన్లు అత్యంత చేరువయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
యానిమల్ సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.797.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ నేడు (డిసెంబర్ 16) అధికారికంగా ప్రకటించింది. దీంతో రూ.800కోట్ల కలెక్షన్ల మైలురాయికి యానిమల్ అత్యంత చేరువలోకి వచ్చింది. మరొక్క రోజులో ఈ మార్క్ దాటనుంది.
యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి నుంచి దుమ్మురేపుతోంది. ఈ చిత్రంపై కొందరి నుంచి విమర్శలు వస్తున్నా.. కలెక్షన్లు మాత్రం దూసుకెళుతున్నాయి. 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.600కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 10 రోజుల్లో రూ.700కోట్ల మార్కును దాటింది. ఇక, రూ.800కోట్ల మైలురాయిని కూడా అధిగమించేందుకు రెడీ అయింది.
ఇండియాలో ఇలా..
ఇండియాలోనే యానిమల్ చిత్రానికి 15 రోజుల్లో రూ.485.14 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. దీంతో దేశీయంగా రూ.500కోట్ల మార్కుకు కూడా దగ్గరైంది. మరో రెండు రోజుల్లో ఇండియాలో రూ.500కోట్లను దాటే అవకాశాలు ఉన్నాయి.
యానిమల్ చిత్రంలో హింస విపరీతంగా ఉందని, బోల్డ్ సీన్లు హద్దులు దాటాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ అవుతోంది. రణ్‍బీర్ కెరీర్లోనే అత్యంత భారీ బ్లాక్‍బాస్టర్‌గా ఇప్పటికే నిలిచింది. రెండు వారాలు పూర్తయినా ఇంకా జోరు చూపిస్తోంది.
యానిమల్ సినిమాలో రణ్‍బీర్ సరసన హీరోయిన్‍గా రష్మిక మందన్న నటించారు. బాబీ డియోల్, తృప్తి డిమ్రి, అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతానీ సంయుక్తంగా నిర్మించారు.
టాపిక్