భారత జట్టులోనూ ‘వై నాట్‌ ఏపీ’.. 

Best Web Hosting Provider In India 2024

 

 

సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి విజన్‌!

‘‘పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువే’’… ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ చెప్పే మాట. ఓట్లు వేసిన ‘పెద్దోళ్ల’కు ఇచ్చిన హామీలే నెరవేర్చని నాయకులు ఉన్న ఈరోజుల్లో.. ఓటు హక్కులేని పిల్లల గురించే ఎక్కువగా ఆలోచించడం ఆయనకే చెల్లింది.

నేటి బాలలే.. రేపటి పౌరులు కదా.. అందుకే చిన్ననాటి నుంచే వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించేలా ఇప్పటికే విద్యా వ్యవస్థలో ఆంగ్ల మాధ్యమం వంటి పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బాలల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు. అంతేకాదు.. నాడు- నేడు పేరిట పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు.

అదే విధంగా చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఉన్నారు సీఎం జగన్‌. అందుకు అనుగుణంగా ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కీలకమైన ప్రతీ క్రీడాంశంలో భాగమైన భారత జట్టులో ‘వై నాట్‌ ఏపీ’ అనే స్థాయికి ఎదగాలంటే క్షేత్రస్థాయి నుంచే బలమైన పునాదులు పడాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నారు.

అంబటి రాయుడు, పీవీ సింధు, జ్యోతి సురేఖ, హనుమ విహారి, జ్యోతి యర్రాజీ, కోన శ్రీకర్‌ భరత్‌, సాత్విక్‌ సాయిరాజ్‌లా తాము తమకిష్టమైన స్పోర్ట్‌లో రాణించాలనుకునే వాళ్ల కోసమే ఈ క్రీడా సంబరాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా.. క్రికెట్‌, ఖో ఖో, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, వాలీబాల్‌ వంటి ఐదు క్రీడాంశాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోటీలు నిర్వహించనుంది.

కనీవినీ ఎరుగని రీతిలో క్రీడా సంబరానికి నాంది
ఇందుకోసం ఇప్పటికే ముప్పై లక్షలకు పైగా మంది ఔత్సాహికులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడిచే మెగా ఈవెంట్లో మండల, మున్సిపల్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం.. క్రీడాకారులకు రూ. 41.43 కోట్ల విలువైన ఐదు లక్షల స్పోర్ట్స్‌ కిట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది కూడా!

క్రీడల్లో రాణిస్తున్న వాళ్లకు పెద్దపీట
వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో సీఎం జగన్‌ ముందు వరుసలో ఉంటారు. ఆర్చరీలో ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించిన విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతికి సురేఖకు డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ ప్రభుత్వం.

గత సర్కారు పాలనలో జ్యోతి సురేఖ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదన్న విషయాన్ని గుర్తించి.. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం ఇచ్చింది. అదే విధంగా రెండుసార్లు ఒలింపిక్‌ పతకం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును సముచిత రీతిలో గౌరవించింది. అదే విధంగా.. వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అండగా ఉంటోంది.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *