Best Web Hosting Provider In India 2024
Darshan on Salaar Clash: సలార్ సినిమాపై కన్నడ హీరో దర్శన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సలార్ మూవీ వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై పాన్ ఇండియన్ లెవెల్‌లో అన్ని భాషల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ కన్నడ డైరెక్టర్ కావడంతో, కన్నడ టాప్ ప్రొడక్షన్ హౌజ్ హోంబలే ఫిల్మ్స్ సలార్‌ను నిర్మించడంతో సాండల్‌వుడ్‌లో స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా భారీ స్క్రీన్స్‌లో ప్రభాస్ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతోన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
సలార్‌కు పోటీగా కన్నడంలో డిసెంబర్ 29న స్టార్ హీరో దర్శన్ నటించిన కాటేరా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సలార్‌తో క్లాష్‌పై కాటేరా ప్రమోషన్స్‌లో దర్శన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నాకు పోటీగా సలార్ మాత్రమే కాదు ఏ సినిమా ఉన్నా తాను భయపడేది లేదని దర్శన్ అన్నాడు. “వాళ్లను చూసి నేను కాదు…కన్నడంలో నా సినిమాను పోటీగా రిలీజ్ చేస్తున్నందుకు వాళ్లే భయపడాలి” అని దర్శన్ కాటేరా ప్రమోషన్స్ లో పేర్కొన్నాడు.
కాటేరా పాన్ ఇండియన్ మూవీ కాదని, ప్యూర్ కన్నడ మూవీ అని దర్శన్ తెలిపాడు. పోటీగా ఏ సినిమా వచ్చినా కన్నడ ఆడియెన్స్ మాత్రం కాటేరానే హిట్ చేస్తారనే నమ్మకముందని కామెంట్స్ చేశాడు. అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. తెలుగు ఆడియెన్స్ దర్శన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
తెలుగు ఆడియెన్స్ కన్నడ, తమిళంతో పాటు అన్ని భాషల సినిమాల్ని ఆదరిస్తుంటే ఆ ఇండస్ట్రీలు మాత్రం తెలుగు హీరోలపై, సినిమాలపై వివక్ష చూపుతూనే ఉన్నారని కామెంట్స్ చేస్తోన్నారు. కాటేరా సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు విలన్‌గా నటిస్తోన్నాడు.