
Best Web Hosting Provider In India 2024

Currency Nagar Movie: ఆంథాలజీ సినిమాల ట్రెండ్ మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో తక్కువే. కొంత గ్యాప్ తర్వాత అంథాలజీ ఫార్ములాలో తెలుగులో ఓ సినిమా రాబోతోంది. కరెన్సీ నగర్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
ఈ అంథాలజీ థ్రిల్లర్‌లో యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందినితో పాటు కమెడియన్ సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డబ్బుకు మనిషికి ఉన్న సంబంధాన్ని చర్చిస్తూ కమర్షియల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా కరెన్సీ నగర్ సినిమాను డైరెక్టర్ వెన్నెలకుమార్ తెరకెక్కించాడు.
నాలుగు విభిన్న కథలతో ఇంట్రెస్టింగ్‌గా మూవీ సాగుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రతి కథ రియలిస్టిక్ కోణంలో సాగుతుందని అంటున్నారు. కరెన్సీ నగర్ సినిమాను డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాను ముక్కాముల అప్పారావు, కోడూరు గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ సదాశివుని, పవన్ సంగీతాన్ని సమకూర్చారు.
టాపిక్