
Best Web Hosting Provider In India 2024

Paneer Pulao Recipe: శాకాహారులకు నచ్చే రెసిపీ పనీర్ పులావ్. దీన్ని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది రెస్టారెంట్ నుండి ఆర్డర్లు పెట్టుకుంటారు. నిజానికి పనీర్ పులావ్‌ను తక్కువ సమయంలోనే టేస్టీగా ఇంట్లో వండుకోవచ్చు. దీన్ని ఎలా వండాలో ఒకసారి చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
పనీర్ పులావ్ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
యాలకులు – ఐదు
ఉప్పు – రుచికి సరిపడా
గరం మసాలా – అర స్పూను
నల్ల మిరియాలు – అర స్పూను
పసుపు – ఒక స్పూను
బిర్యానీ ఆకు – ఒకటి
పనీర్ – 150 గ్రాములు
దాల్చిన చెక్క – ఒకటి
పాలు – మూడు స్పూన్లు
ఉల్లిపాయలు – రెండు
నెయ్యి – మూడు స్పూన్లు
పెరుగు – ఒక కప్పు
పుదీనా – ఒక కట్ట
కారం – ఒక స్పూను
జీడిపప్పులు – గుప్పెడు
కుంకుమ పువ్వు – మూడు రేకులు
పనీర్ పులావ్ రెసిపీ ఇలా
1. పనీర్ పులావ్ చేసేందుకు పనీర్‌ను ముక్కలుగా చేసుకోవాలి. అవి పెద్దవిగా ఉండాలా లేక చిన్నవిగా ఉండాలన్నది మీ ఆసక్తి పై ఆధారపడి ఉంటుంది.
2. ఒక గిన్నెలో ఈ పనీర్ ముక్కలను వేసి చిటికెడు ఉప్పు, పెరుగు, పసుపు, కాస్త నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మ్యారినేట్ చేయాలి. అరగంట పాటు పక్కన పెట్టేయాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యిని వేయాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయించాలి. అవి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించాలి.
4. తర్వాత ఆ ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ మిగిలిన నూనెలో దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, బియ్యం వేసి కలుపుతూ ఉండాలి. మంటను తగ్గించాలి.
6. ఈ లోపు ముందుగా మ్యారినేట్ చేసుకున్న పనీర్ ను మరొక కళాయి వేసి నెయ్యిలో గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి.
7. ఆ వేయించిన పనీర్‌ను ఈ బియ్యంలో వెయ్యాలి. అన్నింటినీ కలిపి ఒకసారి సున్నితంగా కలుపుకోవాలి.
8. యాలకుల పొడిని కూడా వేయాలి. గరం మసాలా, కారం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నాలుగు కప్పుల నీళ్లను వేసి మూత పెట్టాలి.
9. పైన పుదీనా, కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. దించేముందు కుంకుమ రేకుల నీటిని పైన వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
10. తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ పనీర్ పులావ్ రెడీ అయినట్టే.