Dunki Updates: షారుఖ్ ఖాన్ డంకీ సినిమా రన్‍టైమ్ ఇదే.. సలార్ కంటే కాస్త తక్కువ

Best Web Hosting Provider In India 2024

Dunki Runtime Censor Certification: పఠాన్, జవాన్ సినిమాల బ్లాక్‍బాస్టర్లతో బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.1,000కోట్లకుపైగా కలెక్షన్లతో సత్తాచాటాయి. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ కూడా విడుదలకు రెడీ అయింది. ఈ ఏడాది షారుఖ్‍కు ఇది మూడో రిలీజ్‍గా ఉంది. స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డంకీ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కానుంది.

 

ట్రెండింగ్ వార్తలు

డంకీ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అలాగే, ఈ సినిమా రన్‍టైమ్ (నిడివి) 2 గంటల 41 నిమిషాల 24 సెకన్లు (161 నిమిషాలు)గా ఉంది. సెన్సార్ సర్టిఫికేషన్ ద్వారా ఈ సమాచారం వెల్లడైంది.

సలార్ vs డంకీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ, షారుఖ్ సినిమా డంకీ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. డంకీ డిసెంబర్ 21న రిలీజ్ కానుండగా.. ఆ మరుసటి రోజే డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద వార్ చేసుకోనున్నాయి.

మరోవైపు, సలార్ కంటే డంకీ రన్ టైమ్ కాస్త తక్కువ ఉంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ మూవీ 2 గంటల 55 నిమిషాల రన్ టైమ్‍తో వస్తోంది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చింది. కామెడీ, ఎమోషనల్ డ్రామా ‘డంకీ’ మూవీ 2 గంటల 41 నిమిషాల నిడివి ఉండనుంది. ఈ మూవీకి చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ లభించింది.

డంకీ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌషల్, బొమ్మన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, జ్యోతి సుభాష్ కీలకపాత్రలు పోషించారు. త్రీ ఇడియట్స్, పీకే లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన రాజ్‍కుమార్ హిరానీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. విదేశాలకు వెళ్లాలనుకునే నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ డంకీ కథ తిరుగుతుంది. స్నేహం, ప్రేమ, భావోద్వేగాలతో డంకీ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *