Best Web Hosting Provider In India 2024
Chana masala Chat Recipe: శనగలలో (చనా) మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు నిండుగా ఉంటాయి. వీటితో ప్రోటీన్ కూడా లభిస్తుంది. శనగలతో వంటకాలు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. నిజానికి వీటితో స్నాక్స్ ఎక్కువగా చేసుకోవచ్చు. ఒకసారి వీటితో మసాలా చాట్ చేసుకుని చూడండి. రుచి అదిరిపోతుంది. సాయంత్రం పూట పిల్లలకు పెడితే వారికి శక్తిని అందిస్తుంది. 10 నిమిషాల్లోనే ఈ చనా మసాలా చాట్ రెడీ అయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు
చనా మసాలా చాట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
శనగలు (చనా) – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు స్పూను
నీళ్లు – సరిపడినన్ని
నూనె – అర స్పూను
కారం – ఒక స్పూను
ధనియాల పొడి – అర స్పూను
జీలకర్ర పొడి – పావు స్పూను
గరం మసాలా – పావు స్పూను
ఉల్లిపాయ – అర ముక్క
టమాట – అర ముక్క
క్యారెట్ – అర ముక్క
పల్లీలు – గుప్పెడు
చాట్ మసాలా – అర స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
కీరాదోస – చిన్న ముక్క
బ్లాక్ సాల్ట్ – పావు స్పూను
చనా మసాలా చాట్ రెసిపీ ఇదిగో
1. శనగలను ముందుగానే ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి. ఆరు గంటల పాటు నానబెట్టాం, కాబట్టి మూడు విజిల్స్ వరకు ఉడకబెడితే అవి పేస్టులా అయిపోయే అవకాశం ఉంది. ఇక విజిల్‌కే ఆపేస్తే సరిపోతుంది.
2. ఉడకబెట్టినప్పుడే నీళ్ళల్లో ఉప్పును కూడా కలపడం మర్చిపోవద్దు. అవి ఉడికాక వడకట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి. అందులోనే జీలకర్ర పొడి, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేయాలి.
4. తర్వాత ఉడకబెట్టిన సెనగలను వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
5. ఇప్పుడు శెనగలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, వేయించిన పల్లీలు, క్యారెట్ తురుము, కీరా దోస తురుము, చాట్ మసాలా, చిటికెడు కారం వేసి బాగా కలుపుకోవాలి.
6. అంతే టేస్టీగా శనగలతో చేసే చనా మసాలా చాట్ తయారైనట్టే.
7. ఇది శరీరానికి పోషకాలను అందించడమే కాదు, పిల్లలకు శక్తిని అందించి వారు చురుగ్గా, ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది.
టాపిక్