Unstoppable: అన్ స్టాపబుల్ షోలో పవన్ కల్యాణ్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కాపీ కొట్టకు బ్రో అంటూ!

Best Web Hosting Provider In India 2024

Shriya Suhasini Harish Shankar In Unstoppable With NBK: నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా అదరగొడుతున్న అన్ స్టాపబుల్ షో జోరుగా సాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లిమిటెడ్ ఎడిషన్ మూడో ఎపిసోడ్‌ను డిసెంబర్ 22న స్ట్రీమింగ్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు

పాత కక్షలు ఉన్నాయి

అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే లిమిటెడ్ ఎడిషన్ 3వ ఎపిసోడ్ ప్రోమోలో “నాది సుహాసినిది జన్మజన్మల బంధం, నాది శ్రీయాది ఈ మిలినియం బంధం” అని బాలకృష్ణ (Balakrishna) అన్నాడు. “అప్పుడు బాలాకు చాలా సిగ్గు” అని సుహాసిని అంటే “నేను నమ్మట్లేదు” అని డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) అన్నాడు. “నేను కావాలనే మీ ముగ్గురితో మాట్లాడుతున్నాను. హరీష్‌న్ అవాయిడ్ చేస్తున్నా. అతనికి నాకు కొన్ని పాత కక్షలు ఉన్నాయి” అని బాలయ్య అన్నాడు.

వారాహి హాలీడేసా?

దానికి “నేను అందుకే బ్రో అన్నాను” అని హరీష్ శంకర్ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో “ఏంటీ బ్రో నా.. స్టూడియో గేట్లు వేయండి” అని బాలయ్య అన్నాడు. తర్వాత “ఏంటీ వారాహి హాలీడేసా. ఫ్రీగా ఉన్నావ్” అని హరీష్‌ను బాలకృష్ణ అడిగితే.. ఏం చెప్పాలో తెలియకు ముఖం కిందకు పెట్టుకున్నాడు. కాసేపటికి “ఈ గ్యాప్ మటుకే వెకేషన్.. రిలీజయ్యాక సెన్సేషనే” అని హరీష్ బదులిచ్చాడు.

ఊహించినట్లుగా కాకుండా

“మేము కూడా సరదాగా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం” అని హరీష్ అన్నాడు. దానికి “కాపీ కొట్టకు బ్రో.. మెలికలు తిరగకు బ్రో” అని బాలకృష్ణ అన్నాడు. దాంతో అంతా నవ్వారు. అనంతరం “మీ గెస్టుల్లో ఎవరైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్లు మాట్లాడలేదని అనిపించిందా?” అని బాలయ్యను సుహాసిని అడిగింది. “ఒక ఎపిసోడ్‌లో ఒకతను అలాగే చేశాడు” అని బాలయ్య అంటే.. “ఎవరతను?” అని హరీష్ అడిగాడు.

 

ఇంకెవరు రవితేజ

“మీవాడే” అని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురించి కామెంట్స్ చేశాడు బాలకృష్ణ. దాంతో హరీష్ శంకర్ మెడపై చేయి పెట్టుకుని పవన్ కల్యాణ్ మేనరిజం అనుకరించాడు. “మీ గెస్టుల్లో ఎవరైనా మాట్లాడటం ఆపట్లేదు. అన్ స్టాపబుల్ అని అనిపించిందా” అని జయంత్ సి పరాన్జీ అడిగితే.. “ఇంకెవరు రవితేజ” అని బాలకృష్ణ చెప్పుకొచ్చాడు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *