Best Web Hosting Provider In India 2024
Drink for Heart: ప్రపంచంలో గుండె జబ్బులు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతిరోజు ఎంతోమంది గుండెపోటు బారిన పడుతున్నారు. వారిలో చిన్న వయసు వారు కూడా ఉన్నారు. రకరకాల కారణం వల్ల గుండెపోటు సంభవిస్తోంది. అందులో ముఖ్యమైనది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోయి అదంతా రక్తనాళాల్లో చేరుకుంటుంది. దీనివల్ల రక్తప్రసరణకు ఆటంకంగా మారుతుంది. ఫలితంగానే గుండెపోటు వస్తుంది. కాబట్టి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
ట్రెండింగ్ వార్తలు
రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే ఆహారం కొవ్వుగా మారకుండా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వదిలేయాలి. ముఖ్యంగా కొవ్వు నిండిన జంక్ ఫుడ్‌ను తినడం మానేయాలి. అలాగే ప్రతిరోజూ ఒక ప్రత్యేక పానీయాన్ని తాగడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ పానీయం ఎలా తయారు చేయాలో చూద్దాం.
గుండెపోటు రాకుండా అడ్డుకునే పానీయం
కొత్తిమీర, నిమ్మకాయలు, నీళ్లు కలిపి ఈ పానీయాన్ని తయారు చేస్తారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ పానీయాన్ని తయారుచేసుకుని ఫ్రిజ్లో దాచుకోవచ్చు. లేదా ఎప్పటికప్పుడు దీన్ని తయారుచేసి తాగొచ్చు. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. నిమ్మకాయలను తొక్క తీయకుండానే వాడతాం కాబట్టి బాగా శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను, నిమ్మకాయలను చిన్నగా తరిగి మిక్సీలో వేసి జ్యూస్ ను తీయాలి. ఆ జ్యూస్‌ను వడకట్టి ఒక గ్లాసులో వేయాలి.
జ్యూస్ తీసుకునేటప్పుడు అవసరమైతే నీళ్లను కలుపుకుంటూ ఉండాలి. అలా చేసిన జ్యూస్‌ను 24 గంటలు ఫ్రిడ్జ్ లోనే ఉంచాలి. ఆ తర్వాత తీసి బయట పెట్టుకోవాలి. జ్యూస్ గది ఉష్ణోగ్రత వద్దకు మారాక ఒక గ్లాసు ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా ప్రతిరోజు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల్లో రక్తప్రసరణకు ఎలాంటి ఆటంకం కలగదు. అలాగే రక్తం శుద్ధి చెందుతుంది. శరీరంలోని విషపదార్థాలను, వ్యర్ధాలను ఈ జ్యూస్ బయటకు తీసుకొస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రావడం తగ్గుతుంది. కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు, లేనివారు కూడా ఈ పానీయానని ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకుంటే మంచిది.