Best Web Hosting Provider In India 2024
Long hair: అందమైన జుట్టు కావాలని ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. జుట్టు పొడవుగా పెంచుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులు ఉపయోగించే బదులు సింపుల్ గా ఇంట్లో దొరికే ఈ పదార్థాలు ప్రయత్నించి చూడండి. మీ కోరిక చాలా త్వరగా తీరుతుంది. ఈ పదార్థాలు జుట్టు పెరుగుదలని ప్రేరేపిస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కుదుళ్ళని బలోపేతం చేస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
ఉసిరి
ఆయుర్వేదంలో ఉసిరికి ప్రాముఖ్యత ఎక్కువ. ఇది తీసుకోవడం వల్ల జుట్టుకి కావాల్సిన పోషణ అందుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జుట్టు కుదుళ్ళని బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. తెలుపు రంగు జుట్టు రాకుండా నివారిస్తుంది. ఉసిరి పొడి జుట్టుకి పట్టించడం లేదంటే నూనె రాసుకోవడం మంచిది. ఇలా ఏ రూపంలో తీసుకున్నా అది జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
భృంగరాజ్
మూలికల రారాజుగా పేరు తెచ్చుకుంది భృంగరాజ్. ఆరోగ్యకరమైన పొడవైన జుట్టు కోసం భృంగరాజ్ నూనె లేదా పొడి ఉపయోగించవచ్చు. ఇది రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. తలకి పోషణ అందిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్ళని బలపరుస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు మీకు ఇస్తుంది.
మెంతులు
మెంతుల్లో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకి మేలు చేస్తాయి. హెయిర్ ఫోలికల్స్ పటిష్ఠ పరుస్తాయి. జుట్టు విరిగిపోకుండా కాపాడుతుంది. వెంట్రుకలకి సహజమైన మెరుపుని అందిస్తుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి పేస్ట్ చేసుకుని తలకి అప్లై చేసుకోవాలి. లేదంటే హెయిర్ రిన్స్ గా ఉపయోగించవచ్చు.
కలబంద
అలోవెరా జెల్ తలకు నేరుగా అప్లై చేయడం వల్ల జుట్టు pH స్థాయిలు మెరుగుపడతాయి. చుండ్రు సమస్య వదిలిస్తుంది. స్కాల్ఫ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. హెయిర్ ఫోలికల్స్ కు పోషణ అందటం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. ఇది సహజమైన కండిషనర్ గా పని చేస్తుంది. జుట్టు ఆకృతి మెరుగుపడుతుంది.
మందార
మందార పువ్వులు, ఆకుల్లో విటమిన్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకి పోషణ, పెరుగుదలని అందిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఇందులోని సహజ కండిషనింగ్ లక్షణాలు జుట్టుని మృదువుగా చేస్తాయి. జుట్టు వేగంగా పెరిగేందుకు దోహదపడుతుంది. మందార నూనె రాసుకోవచ్చు. లేదంటే మందార హెయిర్ మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు.
వేప
ఎన్నో గుణాలు కలిగిన వేప జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేపలోని శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తల మాడుని శుభ్రపరుస్తుంది. చుండ్రు సమస్యని దూరం చేస్తుంది. ఇన్ఫెక్షన్లని దూరంగా ఉంచి జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. వేప నూనె లేదా వేప కలిసిన ఉత్పత్తులు జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
వివిధ హెయిర్ మాస్క్ లో ఈ పదార్థాలు కలిపి తలకి పట్టించుకోవచ్చు. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి మాత్రమే కాదు ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, హైడ్రేట్ గా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల కూడా వేగంగా జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. ఈ పదార్థాలు ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మరచిపోవద్దు.