Best Web Hosting Provider In India 2024
Egg dum Biryani Recipe: రెస్టారెంట్లలో దొరికే ఎగ్ దమ్ బిర్యాని చాలా టేస్ట్ గా ఉంటుంది. దీని రెసిపీ చాలా సింపుల్. కానీ ఎక్కువమంది దీన్ని వండడం కష్టం అనుకుంటారు, నిజానికి దమ్ బిర్యాని రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా చేసేయవచ్చు. సులువుగా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
ఎగ్ దమ్ బిర్యాని రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
కోడిగుడ్లు – నాలుగు
నెయ్యి – ఒక స్పూను
నూనె – రెండు స్పూన్లు
జీలకర్ర – అర స్పూను
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది
టమాట – ఒకటి
దాల్చిన చెక్క – చిన్న ముక్క
లవంగాలు – మూడు
బిర్యానీ ఆకులు – రెండు
మరాఠీ మొగ్గ – ఒకటి
అనాసపువ్వు – ఒకటి
యాలకులు – మూడు
ఉప్పు- రుచికి తగినంత
పసుపు – పావు స్పూను
కారం – ఒకటిన్నర స్పూను
పెరుగు – రెండు స్పూన్లు
ధనియాల పొడి – రెండు స్పూన్లు
నీళ్లు – తగినన్ని
కొత్తిమీర – ఒక కట్ట
పుదీనా – ఒక కట్ట
నూనెలో వేయించిన ఉల్లిపాయలు – మూడు స్పూన్లు
యాలకుల పొడి – అర స్పూను
కుంకుమపువ్వు – రెండు రేకులు
బిర్యానీ మసాలా – ఒక స్పూను
కసూరి మేతీ – ఒక స్పూను
ఎగ్ దమ్ బిర్యాని రెసిపీ ఇదిగో
1. బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. కోడిగుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నెలో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి ఈ కోడిగుడ్లకు పట్టించి పక్కన పెట్టాలి.
3. స్టవ్ మీద అన్నం వండడానికి గిన్నె పెట్టి అందులో నీళ్లు, మసాలా దినుసులు, ఉప్పు వేసి మరిగించాలి.
4. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేయాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా తరుగును కూడా వేయాలి. ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి.
5. బియ్యం 80% ఉడికాక స్టవ్ కట్టేయాలి.
6. ఇప్పుడు మరో గిన్నెలో నూనె వేసి కోడిగుడ్లను వేయించాలి. అవి ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు మరి కొంచెం నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులను, జీలకర్రను వేయించాలి.
8. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేయాలి.
9. తర్వాత తరిగిన టమాటో ముక్కలను వేసి మగ్గించాలి. గ్రేవీలాగా మగ్గాక కారం, ధనియాల పొడి, పెరుగు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి.
10. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు ఉంచాలి. తరువాత బిర్యానీ మసాలాలను వేసి కలపాలి.
11. ఫ్రై చేసిన కోడిగుడ్లు ,కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కూడా వేసి కలపాలి.
12. చిటికెడు యాలకుల పొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.
13. ఇగురు చక్కగా ఉడికాక సగం గ్రేవీని, కోడిగుడ్లను తీసి పక్కన పెట్టాలి.
14. మిగిలిన గ్రేవీలో 80 శాతం ఉడికించిన అన్నాన్ని లేయర్లుగా వేసుకోవాలి. ఆ లేయర్ల పైన కోడిగుడ్లను, పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీని వేయాలి.
15. పైన ముందుగా నూనెలో వేయించిన ఉల్లిపాయలను చల్లుకోవాలి. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కూడా చల్లాలి.
16. కుంకుమపువ్వును నానబెట్టి ఆ నీళ్లను పైన వేయాలి. ఇప్పుడు ఆవిరి పోకుండా మూత పెట్టి, చుట్టూ టిష్యూ పేపర్‌ను చుట్టాలి.
17. పావుగంట పాటూ చిన్న మంట మీద ఉంచాలి. తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే దమ్ బిర్యాని రెడీ అయినట్టే. దీని రుచి రెస్టారెంట్ స్టైల్ లో ఉంటుంది.