Unique christmas celebrations: క్రిస్మస్ రోజు పాటించే ఈ వింత ఆచారాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Best Web Hosting Provider In India 2024

Christmas celebrations: క్రిస్మస్ పండుగ అనగానే ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం చూస్తూ ఉంటాం. క్రైస్తవులు చర్చికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలు ఏటా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.

 

ట్రెండింగ్ వార్తలు

పండుగ రోజు కేక్ కట్ చేసి విందులో పాల్గొనడం సంతోషంగా గడపడం చేస్తు ఉంటారు. క్రిస్మస్ ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం వింత ఆచారాలు పాటిస్తారు. కొన్ని ఆచారాలు వినోదంగా అనిపిస్తే మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ఆ విచిత్రమైన ఆచారాలు గురించి తెలుసుకుందాం.

షూస్ వదిలేస్తారు

ఐస్ ల్యాండ్ లో యూల్ లాడ్స్ కోసం చిన్న పిల్లలు షూస్ వదిలిపెడతాడు. ఒక రకంగా చెప్పాలంటే యూల్ లాడ్స్ కూడా శాంతా క్లాజ్ మాదిరిగా సహాయం చేసేవాళ్ళు. 13 మంది యూల్ కుర్రాళ్ళు పిల్లలకి బహుమతులు ఇస్తూ వస్తారు. క్రిస్మస్ కి 13 రోజుల ముందు నుంచి పిల్లలు ప్రతి రోజు రాత్రి ఇంటి బయట షూస్ వదిలేస్తారు. యూల్ లాడ్స్ వచ్చి వారికి ఆ షూస్ లో బహుమతులు పెడతారని నమ్ముతారు. మంచి ప్రవర్తన ఉన్న పిల్లలకి మంచి బహుమతులు వస్తాయి. చెడుగా ఉంటే వారికి షూస్ లో కుళ్లిన బంగాళాదుంపలు ఉంటాయట.

క్రాంపస్ రన్

ఆస్ట్రియాలో శాంతా క్లాజ్ సెయింట్ నికోలస్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ దుష్టుడు క్రాంపస్ ఉన్నాడు. శాంతా క్లాజ్ పిల్లలకి బహుమతులు ఇవ్వడానికి వస్తే క్రాంపస్ మాత్రం పిల్లలని ఎత్తుకుపోవడానికి వస్తాడు. ఏటా క్రిస్మస్ రోజు క్రాంపస్ రన్ నిర్వహిస్తారు. ముఖానికి భయంకరమైన క్రాంపస్ మాస్క్ పెట్టుకుని వీధుల్లో సంచరిస్తారు. అందుకే ఆ రోజు పిల్లలు వీధుల్లో తిరగరు.

 

చీపురు దాచిపెడతారు

నార్వేలో పాటించే విచిత్రమైన క్రిస్మస్ ఆచారం గురించి తెలిస్తే కాస్త నవ్వు వస్తుంది. ఇక్కడ ప్రజలు ఆరోజు చీపురుని దాచి పెడతాడు. ఇది శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ ఆచారం. మంత్రగత్తె చీపురుపై తిరుగుతూ ఉంటుందట. ఎవరి ఇంట్లో చీపురు కనిపిస్తే వారి ఇంట్లో మంత్రగత్తె తిష్ట వేసుకుని కూర్చుంటుందని భావిస్తారు. అందుకే ఆ రోజు అందరూ చీపురు ఎవరికీ కనిపించకుండా దాచి పెడతాడు. అలా చేయడం వల్ల దుష్టశక్తులని నివారించవచ్చని నమ్ముతారు.

స్నో బాల్ ఫైట్

ఇదొక ఫన్నీ సంప్రదాయం. క్రిస్మస్ రోజు అందరూ మంచులో చేరి స్నో తో బాల్స్, బొమ్మలు తయారు చేసి ఒకరి మీద మరొకరు విసురుకుంటారు. ఈ స్నో బాల్ ఫైట్ లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. మంచులో చేరి ఆటలాడతారు.

లాంతర్ ఫెస్టివల్

ఫిలిప్పీన్స్ లో ప్రతి సంవత్సరం క్రిస్మస్ ముందు రోజు లాంతర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రజలు అందరూ రోడ్ల మీదకి చేరి లాంతర్లు గాల్లోకి వదులుతారు. వివిధ రకాల ఆకారాల్లో ఉండే లాంతర్లు చూసేందుకు అందరూ వస్తారు. ఈ సంప్రదాయం ఒక ఈవెంట్ గా మారిపోయింది.

 

మేక పుర్రె కాల్చేస్తారు

1960 నుంచి స్వీడన్ లోని ప్రజలు ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. పట్టణం మధ్యలో 40 అడుగులకి పైగా పొడవు ఉంటే పెద్ద మేక పుర్రె లేదా మేక బొమ్మ తయారు చేస్తారు. ఈ క్రిస్మస్ మేక బొమ్మని చూసేందుకు నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. అర్థరాత్రి తర్వాత దాన్ని కాల్చేస్తారు.

సాలెపురుగు డెకరేషన్

ఉక్రెయిన్ లో క్రిస్మస్ చెట్టుని సాలెపురుగు గూడుతో అలంకరిస్తారు. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒక పేద కుటుంబంలోని చిన్నారి క్రిస్మస్ చెట్టుని అలంకరించలేకపోయినందుకు చాలా బాధపడతాడు. తెల్లారి లేచి చూసేసరికి చెట్టు మొత్తం సాలెపురుగులు గూడు పెట్టి ఉంటాయి. దాన్ని చర్చికి తీసుకెళ్లగా అందరూ ఆ చిన్నారిని చూసి హేళనగా నవ్వారు. అప్పుడే అద్భుతం జరిగింది. ఆ సాలె గూడు తీగలు బంగారం, వెండి తీగలుగా మారిపోయి అందంగా మారిపోయింది. ఇప్పటికీ అక్కడ చాలా మంది సాలెపురుగు గూడుతో క్రిస్మస్ చెట్టు అలంకరిస్తారు. అలా చేస్తే అదృష్టం వస్తుందని నమ్ముతారు.

చెక్ రిపబ్లిక్

క్రిస్మస్ రోజు పెళ్లి కానీ స్త్రీలు ఇంటి గుమ్మం ముందు నిలబడి భుజాల మీద ఒక బూటు పెట్టుకుని కిందకు వంగుతారు. ఆ బూటు వారి కాళ్ళ మీద పడితే పెళ్లి అవుతుందని నమ్మకం. గుమ్మం ముందు పడిపోతే పెళ్ళికి మరో ఏడాది పాటు ఆగాల్సిందేనట.

 

 

 

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *