
Best Web Hosting Provider In India 2024
Relationships: ఆధునిక కాలంలో అనుబంధాలు, ప్రేమల విలువ తగ్గిపోయింది. నమ్మకం అనే పునాది మీద నిలబడాల్సిన అనుబంధాలు… అనుమానాలు, మోసాలు వంటి కుతంత్రాలతో నిండిపోతున్నాయి. భాగస్వాములు మోసం చేస్తున్న వారి సంఖ్య ప్రపంచంలో పెరిగిపోతోంది. తమ భాగస్వామి తమను నిజంగానే ప్రేమిస్తున్నారా లేక మోసం చేస్తున్నారా అని తెలుసుకోవడం కోసం వారిలో కొన్ని రకాల లక్షణాలను కనిపెట్టాలి.
ట్రెండింగ్ వార్తలు
ఈ లక్షణాలు కనిపిస్తే…
భాగస్వామి ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు వచ్చినా, ఏదైనా ఇబ్బందికరంగా ఉండేలా ప్రవర్తిస్తున్నా మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పడానికి ప్రారంభ సంకేతంగా భావించాలి. మీతో కమ్యూనికేషన్ విధానంలో మార్పులు వచ్చినా, ఆకస్మికంగా మూడు స్వింగ్‌లు కలుగుతున్నా, కారణం లేకుండా దూరం పెడుతున్నా అనుమానించాల్సిందే. ఒకప్పుడు ఓపెన్ గా కమ్యూనికేట్ చేసే భాగస్వామి ఇప్పుడు డిఫెన్స్ పద్ధతిలో మాట్లాడుతుంటే మాత్రం కాస్త పట్టించుకోవాల్సిన పరిస్థితి.
భాగస్వాముల మధ్య అది స్నేహమైనా, ప్రేమైనా, భార్యా భర్తలైనా భావోద్వేగాల విషయంలో దూరం ఉండకూడదు. ఇది వారి బంధానికి చేటు తెచ్చేది. మీతో మానసికంగా దగ్గరగా ఉన్న మీ భాగస్వామి హఠాత్తుగా ఆసక్తి లేనట్టు మాట్లాడుతున్నా, భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నా… తనలో మార్పు వచ్చిందేమోనని ఆలోచించాలి. మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా దూరంగా వెళ్తే మాత్రం దాని వెనుక ఏదో ఒక కారణం ఉందని అనుమానించాల్సిందే.
ఇప్పటివరకు సాన్నిహిత్యంగా ఉన్నవారు హఠాత్తుగా అలా ఉండడానికి ఇష్టపడకపోవడం, దూరంగా కూర్చునేందుకు ఇష్టపడడం, మీ పట్ల ఆసక్తి తగ్గినట్టు అనిపించడం… వంటివన్నీ కూడా మీరు మోసపోతున్నారని చెప్పడానికి సంకేతాలే. అలాగే లైంగిక ప్రవర్తనలో కూడా మార్పులు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉందని అర్థం చేసుకోవాలి.
మొబైల్ ఫోన్లకు హఠాత్తుగా పాస్వర్డ్ పెట్టడం, లాప్టాప్కి పాస్వర్డ్ మార్చడం, మీ ఇద్దరూ జాయింట్‌గా వాడే అన్ని ఖాతాలకు పాస్వర్డ్ మారిస్తే… వారి ప్రేమలో తేడా వచ్చినట్టే. మీరు ఆ విషయాన్ని బహిరంగంగానే అడగాల్సిన అవసరం ఉంది.
ఫోన్ మీకు కనిపించకుండా దాచడం, నిత్యం చాటింగ్‌లో ఉండడం వంటివి కూడా వారు మీ దగ్గర ఏదో దాస్తున్నారని అర్థం చేసుకోవాలి.
ఎప్పటిలా కాకుండా ఖర్చులు ఎక్కువ చేయడం, అది కూడా మీకు తెలియకుండా ఖర్చు చేయడం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను దాచడం వంటివి కూడా వారి జీవితంలో మరొకరు ఉన్నారు అని చెప్పడానికి ముఖ్యమైన సంకేతంగానే అర్థం చేసుకోవాలని అంటున్నారు మానసిక నిపుణులు.
వారు చేస్తున్న పనుల గురించి ప్రశ్నించినప్పుడు… వారు అతిగా స్పందించినా లేదా ఏదైనా దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించినా మీరు మోసపోతున్నారని అర్థం. మీతో మాట్లాడటానికి ఇష్టపడకపోయినా, మీ సాంగత్యంలో ఉండేందుకు వారు బోర్ కొట్టినట్టు ఫీలవుతున్నా… వారిలోని మార్పులకు ముఖ్యమైన సంకేతాలుగానే చెప్పుకోవాలి. ఆ మార్పులు ఎందుకు వచ్చాయో కూడా కారణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది.
టాపిక్