Best Web Hosting Provider In India 2024
Pimple Popping: టీనేజీ వచ్చిందంటే మొటిమల సమస్య మొదలైపోతుంది. కొందరికి ఈ సమస్య ముప్పయ్యేళ్లు వస్తున్నా కూడా ఇంకా మొటిమలు వస్తూనే ఉంటాయి. చాలా మంది ఆ మొటిమలను గిల్లి అందులో ఉన్న ద్రవాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల చర్మానికి చాలా నష్టం కలుగుతుంది. అక్కడ ఎర్రగా మారి ఉబ్బినట్టు అవుతుంది. మొటిమలు లోతుగా చర్మం లోపలికి పాకుతాయి. దీనివల్ల అక్కడ గుంతలు పడే అవకాశం ఉంది. ఆ గుంతలు జీవితాంతం అలానే ఉంటాయి. ఎప్పటికీ పూడుకుపోవు.
ట్రెండింగ్ వార్తలు
మొటిమలను గిల్లితే…
మొటిమలు వచ్చినప్పుడు వాటిని వేలితో తాకకుండా వదిలేయాలి. చాలామంది రెండు వేళ్ళతో పిండుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ మొటిమ త్వరగా తగ్గినట్టు అనిపించినా, తర్వాత మాత్రం మరింతగా మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే అక్కడ చర్మం విరిగిపోయేలా, ఇన్ఫెక్షన్‌కు దారి తీసేలా మార్పులు జరుగుతాయి. మొటిమలు వచ్చి వాటి మటుకు అవి పోయే వరకు వదిలేయాలి. చేతులతో పదేపదే తాకుతూ, నొక్కుతూ ఉండకూడదు.
మొటిమలను చేత్తో నొక్కి పిండడం వల్ల అక్కడ కొంత కణజాలం కోల్పోతారు. దీనివల్ల అక్కడ మచ్చలు లేదా గుంతల గుర్తులు వంటివి మిగిలిపోతాయి. మొటిమలను నయం చేసే కొన్ని రకాల క్రీములు ఇప్పుడు వచ్చాయి. అవి మొటిమలను రాకుండా ఆపలేవు, కానీ వచ్చిన మొటిమను త్వరగా తగ్గేలా చేస్తాయి. అక్కడ వెచ్చని వస్త్రం వేయడం వల్ల త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఒక వయసులో మొటిమలు వచ్చి పోవడం సహజం. ఆ దశ దాటాక అవి మళ్లీ రావు. కాబట్టి ఆ దశను దాటేంతవరకు వాటిని పట్టించుకోకండి. పదే పదే వాటిని చేత్తో నొక్కుతూ ఉండడం వల్ల అక్కడ నల్లటి మచ్చలు, గుంతలు ఏర్పడి జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతాయి. మీ అందానికి మచ్చలా మారుతాయి. కాబట్టి మొటిమల గురించి ఆందోళన చెందకుండా వదిలేయడమే మంచిది.
టాపిక్