Year Ender 2023 : న్యుమోనియా టూ డెంగ్యూ.. 2023లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యాధులివే

Best Web Hosting Provider In India 2024

2023 చివరి దశకు వచ్చేశాం. చాలా రకాల వ్యాధులు ఈ ఏడాది ఇబ్బంది పెట్టాయి. 2023లో గ్లోబల్ వార్మింగ్, భారీ వర్షపాతం కారణంగా అనేక ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రకారం, నవంబర్ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుండి 4.5 మిలియన్లకు పైగా డెంగ్యూ కేసులు, 4,000 కంటే ఎక్కువ డెంగ్యూ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది చాలా దేశాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు

ఈ ఏడాది చివర్లో చైనా, యునైటెడ్ స్టేట్స్, ఇతర ప్రాంతాలలో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. న్యుమోనియానే ఇందుకు కారణం. దీనితో చాలా మంది మరో మహమ్మారి వచ్చే అవకాశం గురించి ఆందోళన చెందారు. 2023లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యాధుల గురించి ఇప్పుడు చూద్దాం..

డెంగ్యూ జ్వరం వివిధ ప్రాంతాలలో ప్రజారోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యగా కొనసాగింది. డెంగ్యూ వ్యాప్తి పెరుగుతూనే ఉన్నందున దోమల నియంత్రణ వ్యూహాలు, ప్రజల అవగాహన ప్రచారాలపై దృష్టి సారించారు. డెంగ్యూతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. మరణాలు కూడా ఎక్కువే సంభవించాయి. అయితే మనం తీసుకునే జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనే విషయం గుర్తుంచుకోవాలి.

ఈ సంవత్సరం చైనా, యునైటెడ్ స్టేట్స్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో మిస్టీరియస్ న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల కిందట ఈ వ్యాధి గురించి భయం ఎక్కువైంది. మళ్లీ కరోనాలాంటి మహమ్మారి వస్తుందేమోనని అంతా అనుకున్నారు. ఇది పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఈ ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి ఆరోగ్య సంస్థలు పరిశోధనలు చేశాయి. బాధిత పిల్లలు అధిక జ్వరంతో ఉంటారు. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ సమస్య పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

 

వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధులు కూడా ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. చాలా మంది ఈ సంవత్సరం చివరిలో వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడ్డారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయి.

నిజానికి కొవిడ్ 19 తర్వాత.. చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నారు. ఈ ఏడాది దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొవిడ్ అనంతరం చాలా మంది కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని గురించి వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. వ్యాక్సిన్, వేరియంట్‌లు, చికిత్సా ఎంపికల గురించి చర్చ నడిచింది.

మానసిక ఆరోగ్యంతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా యువత మెంటల్ హెల్త్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన జీవనశైలి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు వెతుకున్నారు. కానీ సరైన జీవనశైలి అలవాట్లు, ఆలోచనల్లో మార్పు ఉంటే మానసిక సమస్యల నుంచి బయటపడొచ్చు.

గుండెపోటు మరణాలు కూడా 2023లో ఎక్కువగానే నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖులు గుండెపోటుతో మృతి చెందారు. యువత కూడా ఇటీవలి కాలంలో ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే సరైన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం ఇందుకు కారణం.

 

ఈ ఏడాది జికా, చికున్‌గున్యా వ్యాధులు కూడా విజృంభించాయి. వాతావరణ మార్పులు, పట్టణీకరణతో ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టాయి.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *