Best Web Hosting Provider In India 2024

Salaar Ticket Price Hike: ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రాణ స్నేహితుల కథతో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సలార్ మూవీపై భారీగా హైప్ నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ మూవీ రిలీజ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోన్నారు. సోమవారం లేదా మంగళవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
సలార్ టికెట్ ధరలు…
కాగా తెలంగాణ, ఆంధ్రాలో సలార్ టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నైజాం ఏరియాలో ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. రికార్డు ధరకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడంతో భారీగా ఓపెనింగ్స్ వస్తేనే రికవరీ అయ్యే అవకాశం ఉండటంతో మల్టీప్లెక్స్‌తో పాటు సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరలను వంద రూపాయలు పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రీ మూవీస్ రిక్వెస్ట్ చేసినట్లు చెబుతోన్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులు వచ్చిన తర్వాతే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నట్లు తెలిసింది.
400ల పైనే…
ఒకవేళ వంద రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే మల్టీప్లెక్స్‌లలో సలార్ టికెట్ ధరలు 400లకు పైనే ఉండబోతున్నట్లు సమాచారం. రిక్లైనర్ సీట్స్ ధర ఐదు వందల వరకు ఉంటుందని అంటున్నారు. సింగిల్ స్క్రీన్స్‌లో 275 రూపాయల వరకు సలార్ టికెట్ ధరలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో కూడా టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వాన్ని డిస్ట్రిబ్యూటర్లు కోరినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఏపీలో సలార్ టికెట్ ధరలు ఎంత పెరిగే అవకాశం ఉందన్నది సోమవారం నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ సంస్థ సలార్ సినిమాను నిర్మిస్తోంది. సలార్‌కు సెకండ్ పార్ట్ కూడా రాబోతోంది.