Best Web Hosting Provider In India 2024

Brahmamudi Today Episode: దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కోనేటిలో దీపాలు వెలిగిస్తుంటారు. ఆ టైమ్‌లో కళ్యాణ్, అప్పు క్లోజ్‌గా మాట్లాడుకోవడం చూసి అనామికతో పాటు ఆమె తల్లి సహించలేకపోతారు. మరోవైపు శ్వేత ఫోన్ చేయడంతో కళ్యాణ్ టెన్షన్ పడతాడు.నీ కోసమే గుడికి వచ్చానని, నువ్వు మాత్రం నన్ను అవైయిడ్ చేస్తున్నావంటూ రాజ్‌పై సీరియస్ అవుతుంది శ్వేత. తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ చూడకుండా గుడిలోనే శ్వేతను కలవాలని రాజ్ ఫిక్సవుతాడు. రాజ్ టెన్షన్‌గా కనిపించడం చూసి రుద్రాణి డౌట్ పడుతుంది. కావ్య ఆపిన వినకుండా గుడి వదిలి వెళ్లిపోవడం లేదంటూ ఆమెపై సెటైర్ వేసి రాజ్…శ్వేతను కలుస్తాడు రాజ్.
ట్రెండింగ్ వార్తలు
రాజ్ టెన్షన్…
శ్వేతను కలవడం, ఆమెతో మాట్లాడటం తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేస్తారేమోనని రాజ్ కంగారు పడుతాడు. రాజ్ టెన్షన్ చూసి గుడిలో నుంచి వెళ్లిపోవాలని శ్వేత అనుకుంటుంది. కానీ రాజ్ వద్దని వారిస్తాడు. కోనేటిలో దీపాలు వెలిగించడానికి అగ్గిపెట్టె కనిపించదు. రుద్రాణిని పిలుద్దామని, ఏం లేకుండానే మంట పెట్టగలదని సెటైర్ వేస్తుంది ధాన్యలక్ష్మి. కనకం, రుద్రాణి ఇద్దరి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమని మండుతుందని వారైతేనే అగ్గిపెట్టే లేకుండా నిప్పు పెట్టగలరని అపర్ణ కూడా జోక్ కంటిన్యూ చేస్తుంది. కారులో ఉన్న అగ్గిపెట్టె తీసుకురావడానికి అపర్ణ వెళుతుంది. మరోవైపు రాజ్ వెళ్లి చాలా సేపు కావడంతో అతడిని వెతుకుతూ కావ్య కూడా వెళుతుంది.
అపర్ణ షాక్…
రాజ్‌ను కౌగిలించుకుంటుంది శ్వేత. ప్రేమ మైకంలో ఇద్దరు మునిగిపోతారు. అనుకోకుండా అగ్గిపెట్టె కోసం కారు దగ్గరకు వచ్చిన అపర్ణ…. రాజ్, శ్వేతలను చూసి షాకవుతుంది. కావ్యను పెళ్లిచేసుకున్న తన కొడుకు మరో అమ్మాయి ప్రేమలో ఉన్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేపోతుంది. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతుంది. నీకు ఏం జరిగినా నేనున్నానని మర్చిపోకు అని శ్వేతకు మాటిస్తాడు రాజ్.
కావ్యపై ఫైర్…
కోనేటిలో అనామిక వెలిగించిన దీపం మునిగిపోతుంది. అది చూసి అనామిక తల్లి కావ్యపై ఫైర్ అవుతుంది. నువ్వు, అప్పు కలిసి నా కూతురు దీపాన్ని కావాలనే అర్పేశారని అవమానిస్తుంది. నీ చెల్లికి కళ్యాణ్‌ను ఇచ్చి పెళ్లి చేయాలనే నాటకం ఆడుతున్నావని కోప్పడుతుంది. ముందు మీ అక్కను తీసుకొచ్చి ఇంటికి కోడలిని చేశాడు. ఇప్పుడు మీ చెల్లిని కూడా కళ్యాణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనే పెళ్లికార్డు కాల్చేశావు. ఇప్పుడు నా కూతురు వెలిగించిన దీపాన్ని ఆర్పేశావని కావ్యను అనుమానిస్తుంది అనామిక తల్లి. కావ్య అలాంటిది కాదని ధాన్యలక్ష్మి చెప్పినా కూడా అనామిక తల్లి నమ్మదు.
మంచి స్నేహితులు మాత్రమే…
కళ్యాణ్, అప్పు మంచి స్నేహితులు మాత్రమేనని కృష్ణమూర్తి చెబుతాడు. అప్పు, కళ్యాణ్‌ల పెళ్లి జరిపించాలని కనకం ప్లాన్ వేసిందని, అది ఎవరు కనిపెట్టలేకపోతున్నారని అనామిక తల్లి ఫైర్ అవుతుంది. భార్య మాటలను అనామిక తండ్రి సమర్థిస్తాడు.
అనామిక, కళ్యాణ్‌ల పెళ్లి జరగాలని మా అందరికంటే ఎక్కువగా కావ్య కోరుకుందని రాజ్ భార్యకు సపోర్ట్ చేస్తాడు. నా విషయంలో వదినని తప్పు పట్టొద్దని, తన గురించి నాకు బాగా తెలుసునని కళ్యాణ్ అంటాడు. ఇంత గొడవ జరిగినా అనామిక సెలైంట్‌గా ఉండటం కళ్యాణ్ సహించలేకపోతాడు. అదే మాట ఆమెతో అంటాడు. నువ్వు నా కంటే అప్పుకే ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు నచ్చడం లేదని కళ్యాణ్‌కు బదులిస్తుంది.
కళ్యాణ్‌కు గుడ్‌బై
తన వల్ల అనామిక, కళ్యాణ్ గొడవ పడటం ఇష్టంలేని అప్పు…ఇంకా ఎప్పుడు నన్ను కలవకు అని కళ్యాణ్‌కు చెబుతుంది. అనామికకు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమవుతుంది. కానీ కళ్యాణ్ అప్పును ఆపేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళితే అనామిక ఫ్యామిలీ వేసిన నిందలే నిజమవుతాయని అంటాడు. రుద్రాణి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుతో పాటు కనకం ఫ్యామిలీని తప్పుపడుతుంది. అనామిక ఫ్యామిలీది ఏ తప్పు లేదని అంటుంది.
వదిన లేకపోతే…
అనామిక, కళ్యాణ్ పెళ్లి ఆపడానికే కావ్య ఈ అపశకునాలను క్రియేట్ చేస్తుందని అనామిక తల్లి మరోసారి మాట జరుతుంది. కళ్యాణ్ ఆమెపై సీరియస్ అవుతాడు. మా వదిన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని అంటాడు. వదిన లేకపోతే ఈ పెళ్లి ఎప్పుడో ఆగిపోయేదని అంటుంది. నిమ్మ మొక్కను మార్చిన సంగతి చెప్పబోతాడు. కానీ కావ్య వారిస్తుంది. గొడవ పెద్దది కాకుండా అనామికకు సర్ధిచెబుతుంది.
శ్వేతకు సారీ…
శ్వేతకు రాజ్ ఫోన్ చేస్తాడు. టెంపుల్‌లో సరిగా మాట్లాడలేకపోయానని సారీ చెబుతాడు. నిన్ను దొంగతనంగా కలవడం గిల్టీగా అనిపిస్తోందని అంటాడు. శ్వేతతో రాజ్ మాట్లాడటం అపర్ణ చూస్తుంది. రాజ్‌ను గుడిలో కలిసిన అమ్మాయి ఎవరు? రాజ్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? మరి కావ్యతో చనువుగా ఎందుకు ఉంటున్నాడు? ప‌్రతి విషయంలో ఆమెను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని అనుమానపడుతుంది.
శ్వేతతో బంధం గురించి రాజ్‌ను నిలదీస్తుంది అపర్ణ. కావ్య పరిస్థితి ఏమిటని, ఆమెను కూడా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. కావ్యపై నాకు ఎప్పటికీ ప్రేమ కలగదని తల్లితో అంటాడు రాజ్. ఒకవేళ కావ్య నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావని అడిగితే అందుకు నేను బాధ్యుడిని కాదని బదులిస్తాడు. తాతయ్య ఆరోగ్యం మెరుగైన తర్వాత కావ్యను నా జీవితంలో పంపిచేస్తానని రాజ్ అంటాడు. వెళ్లిపోయేలా చేస్తానని చెబుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది..