Best Web Hosting Provider In India 2024
Instant Breakfast: ఉదయం పూట త్వరగా తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల కోసం ఎక్కువ మంది వెతుకుతూ ఉంటారు. అలాంటి బ్రేక్‌ఫాస్ట్ మరమరాలతో చేసే ఈ టిఫిన్. ఇది పిల్లలకు, పెద్దలకు చాలా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. కాబట్టి స్కూల్‌కి, ఆఫీసులకు బాక్సుల్లో పెట్టి తీసుకెళ్లేందుకు ఈజీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ట్రెండింగ్ వార్తలు
మరమరాల బ్రేక్‌ఫాస్ట్‌కు కావాల్సిన పదార్థాలు
మరమరాలు – రెండు కప్పులు
ఉల్లిపాయ – ఒకటి
జీలకర్ర – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – రెండు
పల్లీలు – అరకప్పు
పచ్చిశనగపప్పు – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
కొబ్బరి తురుము – రెండు స్పూన్లు
ఎండుమిర్చి – రెండు
ఆవాలు – ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు – ఐదు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
మరమరాలతో చేసే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ
1. పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, కొబ్బరి తురుము, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి పొడిలా చేసుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి.
4. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకులు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి.
5. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చిని వేయాలి.
6. ఇవన్నీ వేగాక మరమరాలను ఐదు నిమిషాల పాటు నీళ్లల్లో ఉంచి తర్వాత చేత్తోనే పిండి ఈ మిశ్రమంలో వేయాలి.
7. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసి బాగా కలపాలి.
8. పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే సరిపోతుంది.
9. స్టవ్ కట్టేసి ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను సర్వ్ చేయొచ్చు.
10. ఇంకా రుచిగా కావాలంటే అంటే దీనిపైన పచ్చి ఉల్లిపాయ తరుగును చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.