Best Web Hosting Provider In India 2024
Mehreen Indra Movie: ఈ ఏడాది కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది రజనీకాంత్ జైలర్ మూవీ. ఈ సినిమాలో రజనీకాంత్ కొడుకుగా పాజిటివ్ షేడ్స్‌తో కనిపించే నెగెటివ్ పాత్రలో వసంత్ రవి నటించాడు. ఈ సినిమాలో వసంత్ రవి నటనకు మంచి పేరొచ్చింది. జైలర్ తర్వాత ఓ డిఫరెంట్ మూవీకి వసంత్ రవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సగం ముఖం క్లాస్ లుక్‌లో, మరో సగం ముఖం గడ్డంతో రఫ్ లుక్‌లో వసంత్ రవి కనిపిస్తున్నాడు. ఇంద్ర సినిమాకు శబరీష్ నందా దర్శకత్వం వహిస్తోన్నాడు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ధనుష్ పటాస్ అనంతరం దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇంద్రతో మెహరీన్ కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇంద్ర సినిమాలో అనైకా సురేంద్రన్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డాక్టర్ నుంచి హీరో…
వసంత్ రవి హీరోగా నటిస్తోన్న ఏడవ సినిమా ఇంద్ర. వసంత్ రవి సినిమాల్లోకి రావడానికి ముందు డాక్టర్‌గా చాలా కాలం పాటు పనిచేశాడు. నటనపై ఇంట్రెస్ట్‌తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. రాఖీ, తారామణి, అశ్విన్స్ సినిమాలు హీరోగా అతడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వసంత్ రవి ఫ్యామిలీ రెస్టారెంట్స్ బిజినెస్‌లో ఉంది. చెన్నైలోని నమ్మవీడు వసంతభవన్ రెస్టారెంట్స్ ఓనర్ కొడుకే వసంత్ రవి.