
Best Web Hosting Provider In India 2024
Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. ఆదివారం (డిసెంబర్ 17) గ్రాండ్ ఫినాలే నిర్వహించి టైటిల్ విజేతను ప్రకటించనున్నారు. సుమారు 105 రోజులపాటు సాగిన ఈ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్ ఎంతో కష్టపడ్డారు. వారు అంతలా కష్టపడింది కేవలం బిగ్ బాస్ టైటిల్ కోసం. అలాంటి టైటిల్‌ను వదులుకునేందుకు రెడీ అయ్యాడు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి.
ట్రెండింగ్ వార్తలు
అమర్ దీప్‌కు మాస్ మహారాజా రవితేజ అంటే అమితమైన పిచ్చి. తన హెయిర్ తనలాగే ఉందన్న రవితేజ మాట కోసం కెప్టెన్సీ టాస్క్‌లో అమర్ గుండు గీయించుకునేందుకు ఒప్పుకోలేదు. డ్యాన్స్ షో స్టేజీపై రవితేజ మ్యానరిజం దింపి డిట్టు మాస్ మహారాజాను ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నాడు. అలాంటి రవితేజ బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేలోకి తన ఈగల్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చాడు.
రవితేజ రాగానే అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించాడు అమర్ దీప్. ఈ సందర్భంగా అమర్ దీప్‌కు హోస్ట్ నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. నువ్ ఇప్పుడే స్టేజీ మీదకు వస్తే రవితేజ సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం వస్తుంది అని నాగార్జున చెప్పాడు. కేవలం 7 సెకన్స్ టైమ్ మాత్రమే ఉందని నాగార్జున చెప్పాడు.
నాగార్జున అలా చెప్పడంతో బిగ్ బాస్ గేట్ వైపు అమర్ దీప్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. అది చూసి అమర్ దీప్ భార్య తేజస్విని షాక్ అయి తల పట్టుకుంది. ఇన్నాళ్లు హౌజ్‌లో టైటిల్ కోసం చాలా కష్టపడ్డాడు. అలాంటిది ఈ లాస్ట్ నిమిషంలో నీకోసం బయటకు వచ్చేందుకు రెడీ అయ్యాడు అని రవితేజతో నాగార్జున చెప్పాడు. దానికి అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అని రవితేజ ఎమోషనల్ అయ్యాడు.
ఇదంతా బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు. అయితే, బిగ్ బాస్ గేట్స్ దాటి అమర్ బయటకు వచ్చాడో లేదో తెలియదు కానీ, రవితేజ సినిమాలో అమర్ దీప్ ఛాన్స్ కొట్టేశాడని సమాచారం అందింది. ఇందులో పూర్తి క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.