
Best Web Hosting Provider In India 2024
Chicken Onion Rates : కార్తీక మాసం పూర్తికావడంతో చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ ధర కిలో రూ.260, స్కిన్ చికెన్ ధర రూ.220 వరకు పలుకుతోంది. కార్తీక మాసంలో చికెన్ ధరలు కిలో రూ.130 నుంచి రూ.180 వరకు ఉన్నాయి. కార్తీక మాసం ముగియడంతో మాంస ప్రియులు చికెన్ కొనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతో మార్కెట్ లో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరగనున్నాయి. మరో పది రోజుల్లో క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలతో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. శీతాకాలంలో మాంసాహార వినియోగం ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. మరోవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు చికెన్ వైపే మొగ్గుచూపుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
తగ్గిన ఉల్లి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి గడ్డ ధర తగ్గు ముఖం పట్టాయి. మహబూబ్ నగర్, కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా ఉల్లి భారీగా రావడమే ధరలు తగ్గాయని మలక్‌పేట మార్గెట్ వర్గాలు తెలిపాయి. శనివారం మార్కెట్ లో జరిగిన వేలం పాటలో కిలో రూ.5 పలికిందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర ఉల్లిగడ్డ కనిష్ట ధర రూ.10 పలికింది. శనివారం మహారాష్ట్రలో సైతం ఈ ధరలే పలికాయి. మలక్ పేట మార్కెట్‌కు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 18,090 క్వింటాళ్ల సరుకు రాగా, మొదటి రకం కిలో రూ.30, రెండో రకం రూ.25, మూడో రకం రూ.5 పలికింది.
బహిరంగ మార్కెట్ తగ్గని ధరలు
మహబూబ్‌నగర్ నుంచి 105 క్వింటాళ్ల సరుకు రాగా మొదటి రకం ఉల్లి కిలో రూ.20, రెండో రకం రూ.16, మూడో రకం రూ.5 పలికిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కర్నూలు నుంచి 1215 క్వింటాళ్ల సరుకు రాగా మొదటి రకం కిలో రూ.18, రెండో రకం రూ.15, మూడో రకం రూ.5 పలికింది. మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లి కనిష్ట ధర కిలో రూ.5 పలకగా, బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.30 వరకు ధరలు ఉన్నాయి. తోపుడు బండ్లపై కిలో రూ.30, కిరాణా షాపులు, సూపర్‌మార్కెట్లలో రూ.40 నుంచి రూ.50కు ఉల్లిని విక్రయిస్తున్నారు.
తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్ లో సరుకు తగ్గడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.