
Best Web Hosting Provider In India 2024
TS IAS Transfers : తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అర్వింద్ కుమార్ ను విపత్తు నిర్వహణశాఖకు బదిలీ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించారు. ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్ నియమించారు. ఆయనకు హెచ్ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, ఆర్అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్. శ్రీనివాసరాజును ప్రభుత్వం నియమించింది.
ట్రెండింగ్ వార్తలు
నల్గొండ కలెక్టర్ బదిలీ
జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమించారు. ఆయనకు ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్ నియమితులయ్యారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా వాణిప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మహిళా, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ గా టి.కె.శ్రీదేవి, నల్గొండ కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు.
ఇటీవల బదిలీలు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శైలజా రామయ్యర్ ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. కేంద్ర సర్వీసులు పూర్తి చేసుకుని తెలంగాణ వచ్చిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని హెచ్ఎమ్డీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎండీగా ప్రభుత్వం నియమించింది. రిజ్వీని ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ప్రభుత్వం నియమించింది.
ఐఏఎస్ ల బదిలీలు
- ఆమ్రపాలి – జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ HMDA, మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎండీ
- సయ్యద్ రిజ్వీ – ఇంధన శాఖ కార్యదర్శి
- ముషారఫ్ అలీ ఫరూకీ – TSSPDCL సీఎండీ
- కర్నాటి వరుణ్ రెడ్డి – టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ
- కృష్ణ భాస్కర్ – డిప్యూటీ సీఎం ఓఎస్డీ
- సందీప్ కుమార్ ఝా – ట్రాన్స్ కో జేఎండీ
- బి.గోపి – అగ్రికల్చర్ డైరెక్టర్
సంబంధిత కథనం