Best Web Hosting Provider In India 2024

Machilipatnam News : సముద్ర స్నానానికి వెళ్లి నూజివీడు ట్రిఫుల్ ఐటీ విద్యార్థి గల్లంతైన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ కు నూజివీడు ట్రిఫుల్ ఐటీలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు స్నానానికి వెళ్లారు. అలల తాకిడికి వీరంతా సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో నలుగురిని మెరైన్ పోలీసులు రక్షించగా, అఖిల్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు అఖిల్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.
ట్రెండింగ్ వార్తలు
అసలేం జరిగింది?
కృష్ణాజిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో ఆదివారం విషాదం నెలకొంది. సెలవు కావటంతో నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మచిలీపట్నం బీచ్లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లారు. ఐదుగురు విద్యార్థులు సముద్రంలో స్నానం చేస్తున్నారు. భారీ అలల తాకిడికి మొత్తం ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. ఈ క్రమంలో ఈత కొట్టుకుంటూ ఇద్దరు విద్యార్థులు అలల నుంచి బయటపడ్డారు. మరో ఇద్దరు సముద్రంలోకి కొట్టుకుపోతుండగా వారిని మెరైన్ పోలీసులు రక్షించారు.
అలల తాకిడికి కొట్టుకుపోయిన విద్యార్థి
బీచ్ కు వెళ్లిన మొత్తం ఐదుగురిలో నలుగురు బయటపడగా, మరో విద్యార్థి అఖిల్ సముద్రంలో కొట్టుకుపోయాడు. పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల కింద చిక్కుకొని కొట్టుకుపోయిన అఖిల్ కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అఖిల్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. బయటకు తీశారు. ఈ విషయం తెలిసి అఖిల్ తల్లి కన్నీరు మున్నీరైంది. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.