
Best Web Hosting Provider In India 2024
పెళ్లి అంటే నూరేళ్లు కలిసి జీవించడం. అలాంటి పెళ్లి కొన్ని కారణాలతో జంటల మధ్య విడాకులకు దారితీస్తుంది. నిజానికి కుటుంబ సభ్యులకంటే.. సమాజమే మీ పిల్లలకు పెళ్లి ఎప్పుడు చేస్తారని గుచ్చుతూ ఉంటుంది. కాలు తీసి బయటపెడితే పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నావని యూత్‌కు ప్రశ్నల మీద ప్రశ్నలు. నిజానికి వయసు వచ్చింది కదా.. అని పెళ్లి చేసుకోకూడదు. పెళ్లంటే ఒక బాధ్యత. దానిని సరిగా నిర్వర్తించాలి. సరైన వయసులోనే వివాహం చేసుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు
సమాజంలో బంధువుల నుంచి ఎదురయ్యే పెద్ద ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని. భారతీయ సమాజంలో పెళ్లి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అబ్బాయికి 25 ఏళ్లు దాటిన తర్వాత అందరూ ఒకే ప్రశ్న అడుగుతారు పెళ్లి ఎప్పుడు? అంటూ. నిజానికి వివాహానికి తగిన వయస్సు ఎంత అనే ప్రశ్న గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అమ్మాయికి 23 లేదా 25 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వివాహ వేడుక గురించి ఆలోచిస్తారు. ఒక అబ్బాయికి 27 లేదా 32 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, అతని మనస్సులో పెళ్లి ఆలోచన ప్రారంభమవుతుంది. ఈ ఆలోచన అతని కుటుంబ సభ్యులలో ఎక్కువగా కనిపిస్తుంది. మరికొందరైతే.. 23 ఏళ్లకే పెళ్లి చేసేసుకుంటారు.
అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా.. పెళ్లి చేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అసలు వివాహానికి తగిన వయస్సు ఎంత? ఒక వ్యక్తి తన కుటుంబం లేదా సమాజం పట్ల బాధ్యతగా భావించినప్పుడు, తన జీవితంలో తనకు భాగస్వామి అవసరమని భావించినప్పుడు పెళ్లికి సిద్ధం కావాలి. అయితే దీనికోసం వయసు కూడా చూసుకోవాలి. మెచ్యూరిటీ అనేది అప్పుడే ఎక్కువగా వస్తుంది. పెళ్లి గురించి మన సమాజంలో సామాజిక ఒత్తిడి ఒక ప్రధాన అంశం. చాలా సార్లు ఒక వ్యక్తి ఎవరితోనైనా భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఆ వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవాలని భావిస్తాడు. కొన్నిసార్లు తన కుటుంబానికి మద్దతు, రక్షణను అందించడానికి వివాహం చేసుకుంటారు కొందరు. అయితే దీనికి వయసు గురించి కూడా ఆలోచించాలి.
యూనివర్శిటీ ఆఫ్ ఉటా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 28-32 సంవత్సరాల మధ్య వివాహం చేసుకున్న జంటలు విజయవంతమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు. ఈ వయస్సు జంటలలో విడాకుల రేట్లు కూడా చాలా తక్కువ. అధ్యయనం ప్రకారం 32 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం విడాకుల సంభావ్యత 5 శాతం పెరుగుతుంది. అదే అధ్యయనంలో 28 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న జంటలు కూడా విడాకుల శాతం ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. అందుకే పెళ్లి చేసుకోవడం గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు.. రెండు కుటంబాల ఎమోషన్స్.