Best Web Hosting Provider In India 2024

అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: వైయస్‌ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ.25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం. దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది.
కొత్త కార్డుల్లో ఏముంటాయంటే..
- క్యూఆర్ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు
- ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్‌ఏ ఐడీ
- క్యూఆర్ కోడ్‌తో లాగిన్ ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు
- ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలు
- రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన
- మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం
- అవగాహన అందరికీ..
- ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం ద్వారా.. లబ్దిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించడం.. దాని ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలనే సందేహాలన్నింటినీ ప్రతిఇంట్లో నివృత్తిచేసే కార్యక్రమాన్ని సీఎంవైయస్ జగన్ ప్రారంభిస్తారు.
- అలాగే కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా ప్రతీ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్‌లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు స్వయంగా చూస్తారు. తద్వారా ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన కల్పిస్తారు.