Best Web Hosting Provider In India 2024

పెళ్లికి ముందు, తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఎన్నో మీమ్స్ ఉన్నాయి. చాలా ఫన్నీ విషయాలుగా ఉంటాయి. కానీ పెళ్లైతే జీవితం మారిపోతుంది. స్వేచ్ఛ పోతుంది.. రక్తపోటు పెరుగుతుంది. పెళ్లి తర్వాత టెన్షన్ మొదలవుతుంది లాంటి విషయాలు చాలా మంది చెబుతారు. ఇప్పుడు తెలియదులే.. పెళ్లి తర్వాత అన్నీ అర్థమవుతాయని చాలా మంది అంటారు. అయితే పెళ్లి తర్వాత జంటల్లో బీపీ పెరుగుతుందని శాస్త్రియంగానూ నిరూపితమైంది.
ట్రెండింగ్ వార్తలు
జంట ఇద్దరిలో రక్తపోటు సమస్య పెరుగుతుంది. మీ ఇంట్లో రక్తపోటు తల్లిదండ్రులిద్దరిలోనూ ఉన్నట్లు మీరు గమనించి ఉండవచ్చు. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రక్తపోటు సమస్య ఇద్దరిలో వస్తుంది లేదా ఒకరిలో వచ్చిన కొద్ది రోజులకే మరొకరికి వస్తుంది.
జంట ఎక్కువ కాలం కలిసి జీవించినప్పుడు, వారి జీవనశైలి దాదాపు ఒకేలా ఉంటుంది. అలాగే ఇద్దరూ జీవితంలో ఎదుర్కొనే అన్ని సమస్యలు, సవాళ్లు ఒకేలా ఉంటాయి. ఆహారం కూడా అలాగే ఉంటుంది. అందువల్ల వారి జీవనశైలి కారణంగా భార్యాభర్తలిద్దరిలోనూ బీపీ సమస్యను చూస్తారు. దంపతులు ఒకరి ఆరోగ్యాన్ని ఒకరు ప్రభావితం చేస్తారు. ఇద్దరూ కలిసి జీవించినప్పుడు వారి జీవనశైలి దాదాపు ఒకేలా ఉంటుంది. ఇలా మధ్యవయస్సు తర్వాత ఇద్దరిలోనూ రక్తపోటు సమస్య కనిపిస్తుంది.
రక్తపోటును ఎలా నియంత్రించాలి?
రక్తపోటు చాలా ప్రమాదకరమైనది, అధిక రక్తపోటు గుండె సమస్యలు, స్ట్రోక్‌లకు కారణమవుతుంది. కాబట్టి రక్తపోటును నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తపోటు నియంత్రణలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఎక్కువ శ్రద్ధ చూపడం. బరువు ఎక్కువగా ఉంటే, తగ్గించాలి. మీరు అధిక బరువు కలిగి ఉంటే మీరు బరువు తగ్గాలి. బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన శరీరానికి ఒక ముఖ్యమైన అడుగు.
ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిది. బీపీ తగ్గించడానికి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మానుకోండి. సోడియం-రిచ్ ఫుడ్స్ కంటే పొటాషియం-రిచ్ ఫుడ్స్ తినండి. అలాగే టేబుల్ ఉప్పును ఉపయోగించవద్దు. వంట చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు మాత్రమే వాడాలి.
తక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకు 8 గంటలు నిద్రపోతే బెటర్. ధ్యానం చేయడం చాలా ముఖ్యం. ఇది మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. రక్తపోటు సమస్యను నివారించవచ్చు. మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే అది మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. దీనిద్వారా బీపీ కూడా పెరగదు. ఈ రకమైన జీవనశైలి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.