Salaar Sooreede song lyrics: సలార్ మూవీ సూరీడే సాంగ్ లిరిక్స్ ఇవే

Best Web Hosting Provider In India 2024

Salaar Sooreede song lyrics: సలార్ మూవీ నుంచి ఈ మధ్యే వచ్చిన ఫస్ట్ సింగిల్ సూరీడే గొడుగు పట్టి పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతో మెలోడియస్ గా ఉన్న ఫ్రెండ్షిప్ సాంగ్ వైరల్ గా మారింది. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 22) రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సూరీడే పాట లిరిక్స్ ఓసారి నెమరువేసుకుందాం.

 

ట్రెండింగ్ వార్తలు

సూరీడే పాట లిరిక్స్ ను కృష్ణకాంత్ అందించాడు. హరిణి ఇవటూరి పాట పాడింది. ఇక రవి బస్రూర్ మనసుకు హత్తుకునే మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. కేజీఎఫ్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సక్సెస్ లో ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలుసు కదా. ఇప్పుడు సలార్ తోనూ రవి బస్రూర్ మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. అందుకు తగినట్లే ఈ ఫస్ట్ సింగిల్ సూరీడే గొడుగు పట్టి సాంగ్ సాగింది.

సలార్ ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే

సూరీడే గొడుగు పట్టి

వచ్చాడే భుజము తట్టి

చిమ్మ చీకటి లోను

నీడలా ఉండెటోడు

రెప్పనొదలక కాపు కాసేది కన్ను వాడు

 

ఆకాశం ఇడిసిపెట్టి

ముద్దెట్టే పొలము మట్టి

ఎండ భగ భగ తీర్చె చినుకుల

దూకుతాడు

ముప్పు కలగక

ముందు నిలబడి ఆపుతాడు

 

ఖడ్గమొకడైతే

కలహాలు ఒకడివిలే

ఒకడు గర్జన

ఒకడు ఉప్పెన

వెరసి ప్రళయాలే

 

సైగ ఒకడు

సైన్యమొకడు

కలిసి కదిలితే

కదనమే

 

ఒకరికొకరని

నమ్మి నడిచిన

స్నేహమే ఇదిలే

నూరేళ్లు నిలవాలే

 

కంచె ఒకడైతే

అది మించె వాడొకడే

ఒకడు చిచ్చుర

ఒకడు తిమ్మెర

కలిసి దహనాలే

 

వేగమొకడు త్యాగమొకడు

గతము మరువని గమనమే

ఒకరికొకరని నమ్మి నడిచిన

స్నేహమే ఇదిలే

నూరేళ్లు నిలవాలే

 

సూరీడే గొడుగు పట్టి

వచ్చాడే భుజము తట్టి

చిమ్మ చీకటి లోను నీడల ఉండెటోడు

 

రెప్పనొదలక కాపు కాసేది కన్ను వాడు

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *