Best Web Hosting Provider In India 2024

పనస పండు తొనలు తినడం వరకే కాకుండా పనస కాయతో నాన్‌వెజ్ మరిపించే కూర కూడా చేసుకోవచ్చు. ఈ కూర చపాతీ, అన్నంలోకి ఎలాగైనా బాగుంటుంది. కాస్త మసాలాలు చేసి గ్రేవీలో ఉడికిన కూర తింటే మీకు ఫేవరైట్ అయిపోతుంది. మసాలా కూడా సింపుల్ గా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఈ కూర రుచిగా, సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేయండి.
ట్రెండింగ్ వార్తలు
పనస కూర తయారీకి కావాల్సిన పదార్థాలు:
400 గ్రాముల పనస కాయ
2 చెంచాల నూనె
పావు చెంచా ఆవాలు
పావు చెంచా జీలకర్ర
2 బిర్యానీ ఆకులు
2 ఎండుమిర్చి
1 ఉల్లిపాయ, ముక్కలు
4 వెల్లుల్లి రెబ్బలు
ఇంచు అల్లం ముక్క
అరచెంచా ధనియాల పొడి
అరచెంచా పసుపు
పావు చెంచా మిరియాల పొడి
2 చెంచాల ఎండు కొబ్బరి
చిన్న దాల్చిన చెక్క ముక్క
2 లవంగాలు
అరచెంచా షాజీరా
తగినంత ఉప్పు
పనస కూర తయారీ విధానం:
- కడాయి పెట్టుకుని వేడెక్కాక అరచెంచా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మసాలా దినుసులన్నీ ఒక్కోటి వేసుకోవాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీర, లవంగాలు, వెల్లుల్లి, కొబ్బరి, అల్లం ముక్క వేసుకుని ఒక నిమిషం వేగనివ్వాలి.
- చల్లారాక వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
- అదే కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. ఎండుమిర్చి కూడా వేసుకుని వేగనివ్వాలి.
- ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కాస్త రంగు మారేదాకా వేయించుకోవాలి.
- ఆలోపు పనస ముక్కల్ని కత్తికి, చేతికి నూనె రాసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకుని కాసేపు నూనెలో వేగనివ్వాలి. అందులో పనస ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుతూ వేపుకోవాలి.
- మూత పెట్టి ముక్కల్ని మగ్గనివ్వాలి. కాస్త మెత్త బడ్డాక ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసుకుని ఉడకనివ్వాలి.
- ఇప్పుడు కప్పున్నర నీళ్లు పోసి మూత పెట్టుకుని అవి ఇంకిపోయేదాకా కూర ఉడకనిచ్చి, చివరగా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే సరి. పనసకాయ కూర రెడీ అయినట్లే.