Best Web Hosting Provider In India 2024

Siddipet News: సిద్దిపేట అర్బన్ మండలంలోని తడ్కపల్లి గ్రామంలో ఎస్సి కాలనీ దగ్గర ఉన్న బండోళ్ల చింతల కింద, కొంతమంది మిత్రులు కలిసి రాత్రి 8 గంటల సమయంలో పేకాట ఆడుతున్నారు. ఈ సమయంలో, పేకాట ఆడుతున్న దండు శ్రీనివాస్ (38), గందె రమేష్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. ఒక చిన్న విషయం పైన నీదే తప్పంటే, నీదే తప్పు అను ఇద్దరు కూడా పరస్పరం వాదించుకున్నారు. మిగతా మిత్రులు ఎంత వారించినా, వినకుంటే ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పిడికిలితో ఛాతిలో గుద్దటంతో….
వాదనలో ఆవేశానికి గురైన రమేష్ కోపంతో పిడికిలి గట్టిగా బిగించి శ్రీనివాస్ చాతి పైన ఒక్క గుద్దు గుద్దడంతో, శ్రీనివాస్ నొప్పితో గట్టిగా అరిచి అక్కడిక్కడే కుప్పకూలాడు. ఎంత పిలిచినా పలుకక పోవడంతో, మిగతా మిత్రులు తనను ఒక ప్రైవేట్ వాహనంలో హుటహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తాను చనిపోయిన్నట్టు, డ్యూటీ లో ఉన్న డాక్టర్లు స్పష్టం చేశారు.
శ్రీనివాస్ మృతదేహాన్ని, పోస్టుమార్టుమ్ కోసం మార్చురీ కి తరలించారు. ఆ సంఘటన తర్వాత, ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న రమేష్ పారిపోయాడు అని తన మిత్రులు అంటున్నారు. అయితే, పోలీసులు రమేష్‌ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
సిద్దిపేట చుట్టుపక్కల ఫార్మ్ హౌస్ లలో చాలామంది పేకాట ఆడుతున్నారని, అయితే పోలీసులు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని జిల్లా వాసులు అంటున్నారు. తడ్కపల్లి దగ్గర కూడా ప్రతిరోజు పేకాట ఆడుతున్న విషయం పైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదని గ్రామా వాసులు అంటున్నారు.
పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే, ఈ ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు వాపోయారు. శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్ పనిచేస్తే తప్ప తమ కుటుంబ గడవదని, తన భార్య పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ సంhtఘటన తర్వాత నైనా, జిల్లా వ్యాప్తంగా పేకాట ఆడేవారిపైనా కఠిన చర్యలు తెసుకోవాలని ప్రజలు సిద్దిపేట పోలీసులని కోరుతున్నారు.