TS Welfare Schools Admissions: తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతిలో అడ్మిషన్స్

Best Web Hosting Provider In India 2024

TS Welfare Schools Admissions: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వేర్వేరు సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేష్ విడుదలైంది. తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధిని, విద్యార్ధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనరల్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సంక్షేమ పాఠశాలల్లో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం 2024 ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థతో పాటు, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://tswreis.ac.in లో చూడవచ్చు. దీంతో పాటు http://tgcet.cgg.gov.inలో నోటిఫికేషన్ వివరాలు లభిస్తాయి.

అభ్యర్థులు అర్హతలకు అనుగుణంగా 2023 డిసెంబర్ 18వ తేదీ నుంచి 2024 జూన్ 1వ తేదీలోపె రూ.100 దరఖాస్తు రుసుముతో అప్లికేషన్లు సమర్పించవచ్చు. ఒక ఫోన్ నంబరుతో ఒక దరఖాస్తు మాత్రమే అనుమతిస్తారు.

అభ్యర్ధికి బదులు ఇతరుల ఫోటోలతో దరఖాస్తు చేసే వారిపై ఐపీసీ 416 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. విద్యార్ధుల ఎంపికకు ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. సందేహాల నివృత్తి కోసం 180042545678 నంబరును సంప్రదించవచ్చు.

 

అయా జిల్లాల ప్రిన్సిపల్స్ నుంచి కూడా వివరాలు లభిస్తాయ.2023-24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదవుతున్న విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోడానికి అర్హులని ప్రకటించారు. విద్యార్ధినీ విద్యార్ధులు 4వ తరగతి చదువుతున్నట్లు స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చీఫ్ కన్వీనర్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ నవీస్‌ నికోలస్ తెలిపారు.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *