Best Web Hosting Provider In India 2024

Dear Uma Movie: టాలీవుడ్‌తో బాలీవుడ్ ముద్దుగుమ్మలదే హవా. తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ మందే ఉన్నారు. తాజాగా అనంతపురం అమ్మాయి సుమయారెడ్డి డియర్ ఉమ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. డిఫరెంట్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సుమయారెడ్డి రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తోంది.డియర్ ఉమా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
డియర్ ఉమ సినిమాకు సాయిరాజేష్ మాధవ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇందులో సుమయారెడ్డికి జోడీగా పృథ్వీ అంబర్ హీరోగా కనిపించనున్నాడు. అనంతపురానికి చెందిన తెలుగు అమ్మాయి సుమయారెడ్డి మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.
డియర్ ఉమకు ముందు టాలీవుడ్‌లో పలు అవకాశాలు వచ్చినా కథాబలమున్న సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనే వాటిని తిరస్కరించినట్లు సుమయారెడ్డి తెలిపింది. మంచి నటిగా తనకు డియర్ ఉమ మూవీ పేరు తెచ్చిపెడుతోందని సుమయారెడ్డి ఎదురుచూస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు.
టాపిక్