Best Web Hosting Provider In India 2024

కలలను నెరవేర్చుకుని జీవితంలో విజయం సాధించాలనేది ప్రతి ఒక్కరి కల. క్రమశిక్షణ, దృఢ సంకల్పం, ఫోకస్, నిరంతర కృషి మొదలైనవి కల నెరవేరాలంటే అవసరం. వీటన్నింటితో పాటు మీరు అద్భుతమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మీరు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ప్రేరణ లేకుండా విజయం సులభంగా రాదు. ప్రేరణ లేకుండా కలను సాకారం చేసుకోవాలంటే.. ఆసక్తి తగ్గిపోవచ్చు. విజయవంతం కావాలనుకునే వారిని ప్రేరేపించడానికి ఇక్కడ పది చిట్కాలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
1. అబ్దుల్ కలాంతో సహా చాలా మంది పెద్దలు.. పెద్ద కలలు కనమని మనకు చెప్పారు. ‘మీ కలలు మిమ్మల్ని భయపెడితే, మీ కలలు తగినంత పెద్దవి కావు.’ అని ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ అన్నారు. మనం పెద్దగా కలలు కన్నట్లయితే పెద్ద విజయం సాధించవచ్చు. ‘మీరు చిన్న ఆట ఆడితే, మీకు తక్కువ లాభం వస్తుంది. మీరు పెద్ద ఆట ఆడితే, మీకు పెద్ద లాభం వస్తుంది.’ అని మోటివేషనల్ స్పీకర్ లెస్ బ్రౌన్ చెప్పారు.
2. నక్షత్రాలను చూడాలి, అరికాళ్లను చూస్తే ప్రయోజనం ఉండదు. మీరు చూడగలిగినంత సాధించడం గురించి ఆలోచించండి, ఈ విశ్వం చాలా పెద్దది, మీకు చాలా అవకాశాలు ఉంటాయి. కావాల్సింది కృషి మాత్రమే.
3. మీరు రోజులో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులతో ఇకపై తక్కువగా ఉండండి. ఇప్పటి నుంచి గొప్ప వ్యక్తులతో మీరు ఎక్కువగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనపై చాలా ప్రభావం చూపుతారు. మన గెలుపు కూడా వారి ద్వారానే నిర్ణయించబడుతుంది. జీవితంలో ప్రతికూల వ్యక్తులను నివారించండి. సానుకూల వ్యక్తులను మీ చుట్టు చేర్చుకోండి.
4. వైఫల్యం విజయానికి సోపానం.. అని ఓప్రా విన్‌ఫ్రే అన్నారు. మీరు విఫలమైనప్పుడు వెనక్కు తగ్గొద్దు. ఇది మనల్ని విజయపథంలోకి తీసుకెళ్లే సోపానమని అర్థం చేసుకోవాలి. అనుభవాలే జీవిత పాఠాలు.
5. జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి. ఒక దారిలో చాలా మంది వెళ్తుంటారు. కానీ మీరు తక్కువ మంది ప్రయాణించే రహదారిని ఎంచుకోవాలి. అప్పుడే జీవితంలో పెద్ద తేడా కనిపిస్తుంది. థింక్ డిఫరెంట్.. థింక్ బిగ్ అనే ఫార్ములా చాలా బాగా ఉపయోగపడుతుంది.
6. విజయవంతమైన వ్యక్తుల విజయ కథలను చదవండి. వారి పుస్తకంలో వైఫల్యాలు, విజయాల కథలు చాలా ఉంటాయి. వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు మొదలైనవాటిని చదవడం ద్వారా ప్రేరణ పొందండి.
7. ఎప్పుడూ కలలు కనడం సరిపోదు. ప్రణాళికను అమలు చేయడం చాలా ముఖ్యం. ‘గొప్ప సంస్థలు అద్భుతమైన దృష్టి కారణంగా మాత్రమే కాకుండా, ఆలోచనల అమలు కారణంగా విజయం సాధిస్తాయి.’ అని జెఫ్ బిజోస్ అన్నారు. కలకు తగిన కష్టం ఉండాలి.
8. మీరు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మీ పేదరికం, మీ వైఫల్యం, మీ పరిస్థితి విజయానికి అడ్డంకి కాదు. కేవలం అవి మీ ఆలోచనలు మాత్రమే.
9. విజయం అనేది మీరు ఎంత డబ్బు సంపాదిస్తారనేది కాదు. మీరు వ్యక్తులతో ఎలా ఉన్నారు, వారికి మీరు ఏమి సహాయం చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు ఎదుగుతూ నలుగురికి చేయి అందించాలి.
10. మీరు చేసేది మీ జీవితంలో ఎక్కువ భాగం మీతోనే ఉంటుంది. అందుకే మీకు నచ్చిన విషయాన్ని ఎంచుకోండి. మీకు బోర్ కొట్టని పనిని మీ లక్ష్యంగా చేసుకోండి. మీ లక్ష్యం మీకు సంతృప్తినిస్తే.. మీ జీవితం ఆనందంగా ఉంటుంది.