Best Web Hosting Provider In India 2024

Andole MLA: దళిత బంధు పథకాన్ని ఇప్పిస్తామంటూ తమ వద్ద డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వడం లేదంటూ అందోల్ మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌పై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దళిత బంధు లబ్దిదారుల జాబితాలో ఎంపిక చేయిస్తామంటూ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అతని సోదరుడు కలిసి తమ వద్ద రూ.12.లక్షలు వసూలు చేశారంటూ టేక్మల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
భూమయ్య అనే వ్యక్తి తన వద్ద ఎమ్మెల్యే రూ.6లక్షలు, ఎమ్మెల్యే సోదరుడు రూ.6లక్షలు తీసుకున్నారని టేక్మల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, వేరే నంబర్ల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని భూమయ్య ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల్ని బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఖండించారు. భూమయ్య అనే వ్యక్తి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని, తనకు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని క్రాంతి కిరణ్ ఆరోపించారు. రాజకీయ కక్షతో మంత్రి దామోదర రాజనరసింహ తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమని చెప్పారు.
దళిత బంధు కావాలంటే ఒక్కొక్కరు మూడు లక్షలు చెల్లించాలని డబ్బులు తీసుకున్నారని, పథకం రాకపోగా, తాము చెల్లించిన మొత్తాన్ని అడుగుతుంటే తమను బెదిరిస్తున్నారని భూమయ్య ఆరోపించాడు. ఈ వ్యవహారంపై టేక్మల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.