Afternoon Sleep : మధ్యాహ్నం పురుషుల కంటే స్త్రీలే ఎందుకు ఎక్కువగా నిద్రపోతారు?

Best Web Hosting Provider In India 2024

మధ్యాహ్నం భోజనం తర్వాత మన మూడ్‌ నిద్రవైపుకు మళ్లుతుంది. ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా కాసేపు నిద్రపోవాలని కళ్లు లాగేస్తుంటాయి. ఆఫీస్‌లో ఉన్నా సరే నిద్రను ఆపుకోవాడనికి చాలా కష్టపడతారు. ఈవినింగ్‌ వచ్చే ఛాయ్‌ కోసం ఎదురుచూసే వాళ్లు ఎందరో? అయితే ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్‌ విషయం ఏంటంటే పురుషుల కంటే స్త్రీలే మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోతారట. ఇంట్లో ఉన్నా చాలామంది పురుషులు మధ్యాహ్నం కునుకుతీయరు. కానీ మహిళలు అలా కాదు. దీనికి ఏదైనా కారణం ఉందా అంటే.. ఉందనే అంటున్నారు నిపుణులు.

 

ట్రెండింగ్ వార్తలు

మధ్యాహ్నం భోజనం తర్వాత పవర్ నాప్ చాలా అవసరమని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. 20 మినిట్స్ సూత్రం కూడా దీనికోసం ఉంది. ఈ నిద్ర మన తాజాదనాన్ని పెంచుతుంది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ దీనిపై అధ్యయనం చేసింది. మానవుడు ఒక రోజులో రెండు సార్లు గరిష్టంగా నిద్రపోతాడు.

ఒకటి తెల్లవారుజామున రెండు గంటల నుండి ఏడు గంటల వరకు. మరొకటి మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు. చాలా మందికి ఉదయం సమస్య ఉండదు. ఎందుకంటే అప్పుడు అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఈ మధ్యాహ్నం 2:00 నుండి 5:00 వరకు సమయం కొంచెం సవాలుగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో అందరికీ నిద్రపోయే అవకాశం ఉండదు.

మధ్యాహ్నం నిద్రపోవడానికి కారణం ఏమిటి?

మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడానికి కారణమేమిటో కూడా పరిశోధకులు చెప్పారు. కడుపు నిండితే నిద్ర వస్తుంది. మనం తిన్న తర్వాత మన శరీరం పని చేయడం ప్రారంభిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే పనిని శరీరం చేస్తుంది. ఈ సందర్భంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ విడుదల అవుతుంది. దీని వల్ల మన శక్తి స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో శక్తి తగ్గిపోవడంతో బద్ధకంగా ఉంటారు. నిద్ర రావడం మొదలవుతుంది. కూర్చున్నప్పుడు మగత. భోజనం తర్వాత ఈ బద్ధకాన్ని పోస్ట్‌ప్రాండియల్ డిప్ అంటారు. మెలటోనిన్ వంటి హార్మోన్లు నిద్రను ప్రోత్సహించడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి.

 

మహిళలు ఎక్కువగా నిద్రపోవడానికి కారణం ఏమిటి?

స్త్రీలలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ల మార్పులు, వారు బహిష్టు సమయంలో మరింత అలసిపోయినట్లు భావిస్తారు. అందుకే వారికి ఈ పవర్ నాప్ మరింత అవసరం. మహిళలకు ఈ పవర్ నాప్‌ని గర్ల్ నాప్ అని కూడా అంటారు.

మధుమేహం, థైరాయిడ్, జీర్ణవ్యవస్థ సమస్య, ఆహార అలర్జీ, నిద్రలేమి, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారు కూడా మధ్యాహ్న భోజనం తర్వాత ఎక్కువ నిద్రపోతారు. మీరు తీసుకునే ఆహారం ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రొటీన్లు, సెరోటోనిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే నిద్ర ఎక్కువగా వస్తుంది. చీజ్, సోయాబీన్స్, గుడ్లు తీసుకోవడం తరచుగా నిద్రకు భంగం కలిగిస్తుంది. అయితే మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదే కానీ.. మరీ గంటలు గంటలు పడుకోవడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోవాలి.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *