Best Web Hosting Provider In India 2024

Brahmamudi Today Episode: కళ్యాణ్, అనామిక పెళ్లి ఆపేందుకు కావ్య ప్రయత్నిస్తుందని అనామిక తల్లిదండ్రులు అపోహపడతారు. కావ్యను నానా మాటలు అంటారు. అప్పుతో కళ్యాణ్ పెళ్లిని జరిపించేందుకు కావ్య ప్రయత్నాలు చేస్తుందని ఆమెపై ఫైర్ అవుతారు. కావ్యకు రాజ్, కళ్యాణ్‌తో పాటు మిగిలిన దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. కావ్య అలాంటిది కాదని చెబుతారు.
ట్రెండింగ్ వార్తలు
అనామిక అపార్థం…
కళ్యాణ్‌తో తనకు ఉన్నది ఫ్రెండ్‌ఫిప్ మాత్రమేనని అనామికతో అంటుంది అప్పు. నా వల్ల మీరు గొడవలు పడొద్దని, ఇకపై తానెప్పుడూ కళ్యాణ్‌ను కలవనని చెప్పి వెళ్లబోతుంది. కానీ కళ్యాణ్ ఆమెను ఆపేస్తాడు. నువ్వు వెళ్లిపోతే వాళ్లు వేసిన నిందలు నిజమవుతాయని అంటాడు. అనామిక కూడా అప్పు, కళ్యాణ్ ఫ్రెండ్‌షిప్‌ను అపార్థం చేసుకుంటుంది.
కావ్య ప్రేమలో రాజ్…
రాజ్‌ను శ్వేత హగ్ చేసుకోవడం అపర్ణ చూస్తుంది. కావ్యతో రాజ్ ప్రేమలో ఉన్నాడా? గుడిలో తాను చూసిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అన్నది అపర్ణకు అంతుపట్టదు. గుడిలో చూసిన అమ్మాయిని ప్రేమిస్తే కావ్యతో ఎందుకు చనువుగా ఉంటున్నాడు? ఆమెకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడన్నది అర్థంకాదు. శ్వేతతో రాజ్ ఫోన్‌లో మాట్లాడుతుండగా అపర్ణ చూస్తుంది. అదే విషయమై రాజ్‌ను నిలదీస్తుంది. శ్వేతను ప్రేమిస్తోన్నట్లుగా తల్లికి చెబుతాడు రాజ్. ఆమెకు తప్ప తన మనసులో మరొకరికి చోటు లేదని చెబుతాడు.
కళ్యావతిపై ప్రేమ లేదు…
శ్వేతను ప్రేమిస్తే కావ్య సంగతి ఏమిటని కొడుకును అడుగుతుంది అపర్ణ. కళావతిపై తనకు ఎప్పటికీ ప్రేమ కలగదని రాజ్ తల్లికి బదులిస్తాడు రాజ్. మరి కావ్య నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావని తల్లి అడిగిన ప్రశ్నకు దానికి బాధ్యుడిని నేను కాదని కోపంగా సమాధానం చెబుతాడు.
తాతయ్య కోసమే…
తాతయ్య ఆరోగ్యం కుదుటపడాలనే, ఆయన మనసును బాధపెట్టకూడదనే కావ్యతో చనువుగా ఉంటున్నట్లు నాటకం ఆడుతున్న సంగతిని తల్లికి చెబుతాడు రాజ్. తాతయ్య ఆరోగ్యం బాగుపడిన వెంటనే కావ్యను ఇంట్లో నుంచి పంపించేస్తానని అపర్ణకు చెబుతాడు రాజ్. ఒకవేళ కావ్య వెళ్లనని అంటే ఏం చేస్తావని రాజ్‌ను అడుగుతుంది అపర్ణ. వెళ్లేలా చేస్తానని ఆన్సర్ ఇస్తాడు. అపర్ణ, రాజ్ మాటలను కావ్య విన్నదా? శ్వేత, రాజ్‌ల ప్రేమ విషయం ఆమెకు తెలిసిందా? కొడుకు తప్పును అపర్ణ సమర్థించిందా? లేదా? అన్నది సోమవారం నాటి బ్రహ్మముడి సీరియల్‌లో చూడాల్సిందే.