Best Web Hosting Provider In India 2024

Kajal Uma Movie: కాజల్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ ఉమా షూటింగ్ పూర్తయి ఏడాదిన్నరపైనే అవుతోంది. కానీ ఇప్పటివరకు సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. పెళ్లికి ముందు కాజల్ చేసిన సినిమా ఇది.
ట్రెండింగ్ వార్తలు
ఆ టైమ్‌లో వరుస సక్సెస్‌లు, సినిమాలతో కాజల్ బిజీగా ఉండటంతో ఈ బాలీవుడ్ మూవీ ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది. థియేటర్లలో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ డిలే అయ్యింది. ఆ తర్వాత పెళ్లి, ప్రెగ్నెన్సీలతో కాజల్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో సినిమాపై ఉన్న క్రేజ్, బజ్ పడిపోయింది.
అన్‌రిలీజ్‌డ్ మూవీస్ లిస్ట్‌లోకి…
కాజల్ అన్‌రిలీజ్‌డ్ మూవీస్ లిస్ట్‌లోకి ఉమా చేరిపోయింది. కాజల్‌తో పాటు జనాలు మర్చిపోయిన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే థియేటర్లలో కాదు. డైరెక్ట్‌గా ఓటీటీలో ఉమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. జనవరి 19 లేదా 26 నుంచి కాజల్ ఉమా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు చెబుతోన్నారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్…
ఉమా మూవీకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ తథాగథా సిన్హా దర్శకత్వం వహించారు. ఈ లేడీ ఓరియెంటెడ్ డ్రామా మూవీలో కాజల్ అగర్వాల్‌తో పాటు ఆయోషీ తాలుక్‌దార్, గౌరవ్ శర్మ ప్రధాన పాత్రలను పోషించారు. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఉమా మూవీ కథ సాగుతుందని సమాచారం.
ఓ రాజవంశీయుల పెళ్లి వేడుకలోకి అపరిచితురాలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ అపరిచితురాలు ఎవరన్నదే ఈ సినిమా కథ. మరోవైపు తెలుగులో ఇటీవలే భగవంత్ కేసరితో పెద్ద సక్సెస్‌ను అందుకున్నది కాజల్. ప్రస్తుతం సత్యభామ పేరుతో ఓ యాక్షన్ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది