Best Web Hosting Provider In India 2024

మెరిసే ముఖాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మాన్ని తేమగా ఉంచుకోవడం కోసం రకరకాల క్రీముల కోసం ఎంతో డబ్బునూ వెచ్చిస్తారు. కొంతమంది మాత్రం సింపుల్ గా కొబ్బరినూనె రాసేసుకుంటారు. దీనివల్ల చర్మానికి మేలా కీడా అనేది వివరంగా తెల్సుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
కొబ్బరి నూనె ప్రయోజనాలు:
ఈ చలికాలంలో నిద్రకు ఉపక్రమించే ముందు ఓ చెంచా కొబ్బరి నూనెను తీసుకోండి. దాన్ని రెండు చేతుల మధ్యలో వేసి బాగా రుద్దండి. అవి కాస్త వేడిగా అయ్యాక ముఖానికి చేతుల్ని ఆనించి సున్నితంగా మర్దన చేయండి. ఇలా రోజూ రాత్రి మర్దన చేయడం వల్ల రాత్రంతా ముఖం తేమగా ఉంటుంది. చర్మం పొడిబారదు.
కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రి రాసుకోవడం వల్ల ఇవన్నీ చర్మంలోకి బాగా ఇంకి పోతాయి. ఇవి మొటిమల్ని రానీయవు. చికాకుగా ఉన్న చర్మానికి స్వాంతన కలిగిస్తాయి. దాన్ని మీరు మసాజ్ చేయడం వల్ల ముఖంలోకి రక్త ప్రసరణ బాగా జరిగేందుకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. అందువల్ల సహజంగానే ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
పొడి, సెన్సిటివ్ చర్మాలు ఉన్న వారు తప్పకుండా దీన్ని రాత్రిళ్లు ఉపయోగించడం వల్ల చర్మం లోతుల నుంచి మాయిశ్చరైజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది సహజమైన మాయిశ్చరైజర్. పైగా దీనిలో ఎలాంటి కృత్రిమ రసాయనాలూ ఉండవు. కాబట్టి దీన్ని వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభాలు ఉండవు.
దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మొటిమల వల్ల వచ్చే వాపులు, కళ్ల కింద వాపుల్లాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. అలాగే మొటిమలు, వాటి వల్ల అయిన గాయాలను తొందరగా తగ్గించడంలోనూ ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే బ్లాక్ హెడ్లు, వైట్ హెడ్లు లాంటివి రావడం, మొటిమలు రావడమూ తగ్గుతుంది.
రాత్రిళ్లే కాకుండా బయటకు వెళ్లేప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు. దీనిలో 20 శాతం వరకు అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే శక్తి ఉంది. అందువల్ల ఇది యాంటీ ఏజింగ్‌లా పని చేస్తుంది. అతినీలలోహిత కిరణాల తాకిడి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అలాగే దీన్ని సహజమైన మేకప్ రిమూవర్‌లాగా కూడా వాడుకోవచ్చు. ఇది మేకప్‌ని పూర్తిగా తొలగించడంతోపాటు చర్మాన్ని శుభ్రం చేసే క్లెన్సర్ లాగానూ పని చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అవసరం అయిన సమయంలో అవసరం అయినట్లుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిళ్లు మసాజ్ చేసుకోవడం వల్ల మాత్రం లాభాలు అనేకం.