Best Web Hosting Provider In India 2024

Brahmamudi December 19th Episode: శ్వేతతో ఫోన్ మాట్లాడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా కొడుకును పట్టుకుంటుంది అపర్ణ. తల్లికి ఏం సమాధానం చెప్పాలో తెలియక సెలైంట్‌గా వెళ్లిపోబోతాడు రాజ్. అసలు నువ్వు ఏం చేస్తున్నావని కొడుకును నిలదీస్తుంది అపర్ణ. కావ్య విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావని అడుగుతుంది. కావ్య నా జీవితం ఉండదని అంటాడు. అప్పుడు, ఇప్పుడు అదే మాట చెబుతున్నానని తల్లితో అంటాడు.
ట్రెండింగ్ వార్తలు
ప్రేమ ఉన్నట్లు కాదు…
గుడిలోనూ, పెళ్లి పత్రిక కాలిపోయినప్పుడు ఎందుకు కావ్యను వెనకేసుకువచ్చావని కొడుకును నిలదీస్తుంది. కావ్యను చేయని తప్పుకు నిందించారని ఆమెకు సపోర్ట్ చేశానని అంటాడు. గొడవల్లో కళ్యాణ్ ఇష్టపడ్డ అమ్మాయికి ఎక్కడ దూరమవుతాడోనని అలా మాట్లాడానని రాజ్ అంటాడు. కావ్యకు సపోర్ట్ చేసినంత మాత్రానా ఆమెపై ప్రేమ ఉన్నట్లు కాదని చెబుతాడు. కానీ మాకు అలా కనిపించలేదు. నీ భార్య కాబట్టి వెనకేసుకువచ్చావని అనిపిస్తోందని కొడుకుతో అంటుంది అపర్ణ.
నిజమైన ప్రేమ అనుకుంటే…
నీది నిజమైన ప్రేమ అనుకొని కావ్య నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావని కొడుకుతో అంటుంది అపర్ణ. నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిదని హెచ్చరిస్తుంది. తాతయ్య ఆరోగ్యం బాగయ్యే వరకు కావ్యపై ప్రేమ ఉన్నట్లు నటిస్తానని, ఆ తర్వాత కళావతిని తన జీవితంలో నుంచి పంపిచేస్తానని తల్లికి చెబుతాడు రాజ్. కొడుకు ఆలోచనలను అపర్ణ అర్థం చేసుకుంటుంది. రాజ్ కావ్యను వదిలేసి తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాడని అర్థం చేసుకుంటుంది. అదే జరగాలని ఆశపడుతుంది.
విక్రమాదిత్య, పద్మావతి ఎంట్రీ…
సీరియల్‌లోకి కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తాయి. ఎక్కడ ఏ తేడా రాకూడదని విక్రమాదిత్య పద్మావతితో చెబుతాడు. సీఈవోగా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నాకే ఎక్కువగా బాధ్యత ఉందని పద్మావతి మనసులో అనుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే నాకు విజయంతో పాటు భర్త ప్రేమ కూడా దక్కుతుందని పద్మావతి మనసులో కోరుకుంటుంది. విక్రమాదిత్యప్రాజెక్ట్ కోసం వినడానికి ఫారినర్స్ వస్తారు. వారితో వచ్చిరాని ఇంగ్లీష్‌లో పద్మావతి మాట్లాడి ఇబ్బంది పెడుతుంది.
కనకం పశ్చాత్తాపం…
కళ్యాణ్ చేతికి కంకణం కడుతుంది కావ్య. నీపై ఏ చెడు దృష్టి పడకూడదని కడుతున్నానని అంటుంది. మీరు ఉండగా నాపై ఏ చెడు దృష్టిపడదని కళ్యాణ్ బదులిస్తాడు. మా పెళ్లి జరిపిస్తారని దేవుడి కంటే మిమ్మల్నే ఎక్కువగా నమ్ముతున్నానని కళ్యాణ్ అంటాడు.
జాతకంలో దోషం అని పంతులు చెప్పడంతో అనామిక నాకు ఎక్కడ దూరమవుతుందోనని భయపడ్డానని, కానీ అడ్డంకులు మొత్తం దూరమయ్యానని ఆనందపడతాడు. ఒకవేళ అనామిక దూరమైతే నా జీవితంలోకి మరో అమ్మాయికి చోటు ఇవ్వనని, అనామిక జ్ఞాపకాలతోనే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతానని అంటాడు. అనామికను కళ్యాణ్ ఎంత ఇష్టపడుతున్నాడో తెలిసిన తర్వాత అతడి పెళ్లి ఆపడానికి ప్రయత్నించి తప్పు చేశానని కనకం పశ్చాత్తపపడుతుంది. పెళ్లి ఆపితే అనామిక ఉసురు తన కూతురికి తగులుతుందని అనుకుంటుంది.
విక్రమాదిత్య డ్రీమ్ ప్రాజెక్ట్…
విక్రమాదిత్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ చేసుకోబోతున్నాడని, ఈ ప్రాజెక్ట్‌ను పద్మావతి హ్యాండిల్ చేస్తుందని విక్రమాదిత్య ఆఫీస్‌లో పనిచేసే ఎంప్లాయ్ శత్రువుకు సమాచారం అందిస్తాడు. అదే జరిగితే విక్రమాదిత్య, పద్మావతి ఒక్కటవ్వడం ఖాయమని చెబుతాడు. అలా జరగనివ్వనని శత్రువు చెబుతాడు. మరోవైపు తన ప్రజెంటేషన్‌కు పద్మావతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
దుగ్గిరాల ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లు…
కళ్యాణ్ పెళ్లి ఏర్పాట్లను దుగ్గిరాల ఫ్యామిలీ మొదలుపెడుతుంది. పెళ్లికి విక్రమాదిత్యను పిలవాలని కళ్యాణ్‌కు చెబుతుంది ఇందిరాదేవి. కానీ రుద్రాణి అడ్డుకుంటుంది. విక్రమాదిత్యకు రాజ్ వీడియో కాల్ చేస్తాడు. మధ్యలోకి కావ్య ఎంట్రీ ఇచ్చి రాజ్ భార్యను తానే అని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ పెళ్లికి విక్రమాదిత్యను భార్య పద్మావతితో కలిసి రావాలని ఆహ్వానిస్తాడు రాజ్. దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌తో పద్మావతి కూడా మాట్లాడుతుంది.
పద్మావతికి షాక్…
ప్రజెంటేషన్స్ కోసం పద్మావతి అన్ని రెడీ చేస్తుంది. కానీ మోడల్స్ ఇద్దరు రావడం లేదని తెలిసి పద్మావతి కంగారు పడుతుంది. పద్మావతి సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఈ తప్పు జరిగిందని పద్మావతిపై విక్రమాదిత్య సీరియస్ అవుతుంది. మోడల్స్ రాకపోవడంతో మనమే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గెటప్ వేసుకుందామని విక్రమ్‌కు ప్రపోజల్ పెడుతుంది పద్మావతి. మరోసారి దారిలేక విక్రమ్ ఒప్పుకుంటాడు.
కృష్ణమూర్తి డౌట్…
కళ్యాణ్ పెళ్లికి తాను రాలేనని తండ్రితో అంటుంది అప్పు ఎంత బతిమిలాడిన వినదు. నువ్వు పెళ్లికి రానంటే కళ్యాణ్ ఒప్పుకోడదని అంటుంది. నువ్వు రాకపోతే మీ బంధం గురించి అందరికి డౌట్ వస్తుందని కృష్ణమూర్తి అంటాడు. తండ్రి మాటలతో కళ్యాణ్ పెళ్లికి వెళ్లాలని అప్పు ఫిక్సవుతుంది. ఫారినర్స్ ఏం చెప్పకుండా వెళ్లిపోవడంతో విక్రమాదిత్య టెన్షన్ పడతాడు. ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుందని అతడికి పద్మావతి ధైర్యం చెబుతుంది. విక్రమాదిత్య, పద్మావతి మధ్య ప్రేమను చంపేస్తేనే తన ప్లాన్ వర్కవుట్ అవుతుందని వారి శత్రువు అనుకుంటాడు. పద్మావతి తప్పు చేసేలా చేసి ఆమెపై విక్రమ్ మనసులో ద్వేషాన్ని పెంచాలని అనుకుంటాడు.