Best Web Hosting Provider In India 2024

Dunki vs Salaar Day 1 Collection: ఈ వారం బాక్సాఫీస్ వద్ద షారుఖ్‌ఖాన్ డంకీతో పాటు ప్రభాస్ సలార్ పోటీపడబోతున్నాయి. డంకీ గురువారం రిలీజ్ అవుతోండగా ప్రభాస్ సలార్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఇద్దరు అగ్ర హీరోల మధ్య పోటీ బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిరోజు షారుఖ్‌ఖాన్ డంకీ, ప్రభాస్ సలార్‌లలో ఏది ఎక్కువ వసూళ్లను రాబడుతుందన్నది ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్‌లో డంకీ కంటే సలార్ ఎక్కువగా రాబట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లు…
తొలిరోజు సలార్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల వరకు కలెక్ట్ చేయవచ్చని అంటున్నారు. ఓవర్‌సీస్‌లో యాభై కోట్లు, బాలీవుడ్‌లో 30 కోట్లు, మిగిలిన రాష్ట్రాల్లో 20 కోట్ల వరకు సలార్‌కు కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మొదటిరోజు సలార్ మూవీ సినిమా వరల్డ్ వైడ్‌గా 170 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2023లో తొలిరోజు హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే మూవీగా సలార్ రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.
షారుఖ్ ఖాన్ డంకీ…
షారుఖ్‌ఖాన్ డంకీ మూవీకి తొలిరోజు 80 నుంచి 90 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ రావచ్చునని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. జవాన్ తర్వాత వస్తోన్న షారుఖ్‌ఖాన్ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే పఠాన్, జవాన్‌కు భిన్నంగా కామెడీ డ్రామాతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడంతో కాస్తంత వెనుకబడిపోయింది.
ఆ ఎఫెక్ట్ ఒపెనింగ్స్‌పై పడినట్లు చెబుతోన్నారు. సలార్ కంటే తొలిరోజు డంకీ తక్కువే వసూళ్లను రాబట్టనున్నట్లు చెబుతోన్నారు. సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్నాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు డంకీ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణీ దర్శకుడిగా వ్యవహరిస్తోన్నాడు. ఈ కామెడీ డ్రామా మూవీలో విక్కీ కౌశల్, తాప్సీ క ఈలక పాత్రలు పోషిస్తోన్నారు.