TS Covid cases: విస్తరిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

Best Web Hosting Provider In India 2024

TS Covid cases: కొత్త వేరియంట్‌ ఉధృతి పెరగడంతో గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు

సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు కొత్త వేరియంట్ కేసులు బయట పడలేదని చెప్పారు.

కొత్త వేరియంట్‌ లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంత మందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

దేశంలో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 260 కేసులు నమోదు కాగా…..ఐదుగురు మృతి చెందారు.ఒక్క కేరళ రాష్ట్రంలోనే నలుగురు మరణించగా…..ఉత్తర్ ప్రదేశ్ లో ఒకరు చనిపోయారు. కేరళ లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 బయటపడింది.

ఈ తాజా పరిణామాలు అన్నీ దేశ ప్రజలను మళ్ళీ భయ ప్రాంతులకు గురి చేస్తున్నాయి.కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

గాంధీ ఆస్పత్రిలో ఏర్పాట్లు….

కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేసింది.కరోనా స్పెషల్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

 

సాధారణ రోగుల కోసం 30 పడకులు,గర్భిణులు కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు.ఇప్పటివరకు తెలంగాణలో కొత్త వేరియంట్ కేసులు బయట పడలేదని రాజారావు అన్నారు.కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామని చెప్పారు.

మరోవైపు కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా ఉండి అన్నీ రకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్యా ఆశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కేరళలో జేఎన్ 1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరి మలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రతగా ఉండాలని,అవసరమైన మేరకు మాస్కులను ధరించాలని అయన ప్రజలను కోరారు.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *