Best Web Hosting Provider In India 2024

Salaar Breakeven: ప్రభాస్ నటించిన సలార్ మూవీ శుక్రవారం (డిసెంబర్ 22) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఊహించినట్లే ఈ మూవీకి ఓ రేంజ్ లో హైప్ క్రియేటైంది. ఇన్నాళ్లూ డల్లుగా ఉన్న సలార్ ప్రమోషన్లు.. సోమవారం (డిసెంబర్ 18) వచ్చిన రిలీజ్ ట్రైలర్ తో మరో లెవల్ కు వెళ్లాయి. అయితే ఈ సినిమా హిందీలో లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలి?
ట్రెండింగ్ వార్తలు
సలార్ పై ఉన్న అంచనాలతో ఈ మూవీ భారీగా ప్రిరిలీజ్ బిజినెస్ చేస్తోంది. దీంతో ఈ సినిమా హిందీలో సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే కనీసం రూ.200 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించాలని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన గత మూవీ కేజీఎఫ్ 2 హిందీ మార్కెట్ లోనే రూ.400 కోట్లకుపైగా నెట్ వసూళ్లు సాధించింది. అయితే ఈసారి షారుక్ ఖాన్ డంకీ రూపంలో సలార్ కు పోటీ ఉంది.
గురువారమే (డిసెంబర్ 21) రిలీజ్ అవుతున్న డంకీ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సలార్ కు పోటీ ఎదురైంది. ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ కంటే డంకీ ముందుంది. ఒక రోజు ముందే రిలీజ్ కానుండటంతో ఒకవేళ డంకీకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సలార్ కు మరింత సవాలు ఎదురైనట్లే. ఈ లెక్కన హిందీ మార్కెట్ లో రూ.200 కోట్ల నెట్ మార్క్ అందుకోవడం అంత సులువుగా కనిపించడం లేదు.
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో సోమవారానికి సలార్ కంటే డంకీనే ఎక్కువ తొలి రోజు వసూళ్లు సాధించింది. డంకీ మూవీకి రూ.7.36 కోట్లు రాగా.. సలార్ కు అన్ని భాషల్లో కలిపి రూ.6 కోట్లు వచ్చాయి. డంకీ కేవలం హిందీలోనే రిలీజ్ అవుతుండగా.. సలార్ మాత్రం తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
అయితే సలార్ మేకర్స్ తెలుగు మార్కెట్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఏపీ, తెలంగాణల్లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ లో వచ్చిన రూ.6 కోట్లలోనూ రూ.3.5 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవే కావడం విశేషం. మొత్తంగా 2.47 లక్షల టికెట్లు అమ్ముడవగా.. అందులో ఏపీ, తెలంగాణల్లోనే 1.29 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
సలార్ మూవీకి హిందీలో రూ.1.11 కోట్లు, మలయాళంలో రూ.98 లక్షలు వచ్చాయి. అయితే ప్రశాంత్ నీల్ సొంత రాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. కన్నడలో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటి వరకూ కేవలం రూ.9.9 లక్షలు మాత్రమే వచ్చాయి.