Best Web Hosting Provider In India 2024

మనం మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజూ స్నానం చేస్తాం. అలాగే మన జుట్టును శుభ్రం చేసుకోవడానికి వారానికి ఒకటి రెండు సార్లు తల స్నానమూ చేస్తుంటాం. అదే విధంగా మన అంతర్గత అవయవాలనూ నెలకి ఒకసారైనా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే అనేక రకాల డిటాక్స్ డ్రింకులు, డిటాక్స్ ఫుడ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే మనం తిన్నవి సరిగ్గా అరగాలన్నా.. అరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా మల విసర్జన జరగాలన్నా ముందు మన పొట్ట శుభ్రంగా ఉండాలి. మరి ఏం తినడం, తాగడం ద్వారా మన పొట్టల్ని సహజంగా శుభ్ర పరుచుకోవచ్చో తెలుసుకుందాం. పొట్టను శుభ్రం చేసుకోవడానికి ముందుగా నెలలో ఒక రోజును కేటాయించుకోవాలి. ఆ రోజు తినే, తాగే.. ఆహారాలు, పానీయాలు అన్నీ అందుకు తగినట్లుగా ఉండేలా ప్రణాళిక చేసుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు
హెర్బల్ టీలు :
అల్లం, మిరియాలు, పసుపు.. లాంటి వాటితో హెర్బల్ టీలను తయారు చేసుకుని తాగవచ్చు. వీటిలో యాంటీ మైక్రోబియల్ ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియాలను తగ్గించివేస్తాయి. తద్వారా మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలూ తగ్గుముఖం పడతాయి. పేగుల కదలిక సజావుగా జరిగి సులువుగాక్కగా మల విసర్జన జరుగుతుంది. పొట్ట, పేగులు శుభ్ర పడతాయి.
పండ్ల రసాలు, స్మూతీలు :
సీజనల్‌గా వచ్చే పండ్లను తీసుకుని రసం చేసుకుని పరగడుపునే తాగవచ్చు. అలాగే తాజా కూరగాయల్ని, అలోవెరా లాంటి వాటిని తీసుకుని స్మూతీలుగా చేసుకుని తాగవచ్చు. ఇవి పెద్ద పేగు కదలికల్ని మెరుగుపరిచి పొట్ట చక్కగా శుభ్రం కావడంలో సహకరిస్తాయి.
తేనె, నిమ్మరసం :
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో ఓ చెక్క నిమ్మరసం, ఓ స్పూను తేనె కలుపుకుని తాగాలి. ఇది సహజంగా పొట్టను శుభ్రం చేస్తుంది.
పీచు పదార్థాలు :
పొట్టను శుభ్రం చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజున ఉదయాన్నే పైన పేర్కొన్న టీలు, జ్యూసుల్లో ఏదో ఒక దాన్ని తాగాలి. తర్వాత భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. తాజా కూరగాయలు, క్యారెట్లు, కిడ్నీ బీన్స్, శెనగలు, క్వినోవా, ఓట్స్ లాంటివి తీసుకోవాలి. అలాగే యాపిల్, పియర్, స్ట్రాబెరీ లాంటి పండ్లను తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి మీ పొట్ట మెరుగ్గా శుభ్రం కావడానికి సహకరిస్తాయి.
ఎక్కువ నీరు :
ఈ రోజంతటిలో ఎక్కువగా నీరు తాగే ప్రయత్నం చేయాలి. కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆహరం తిన్న కాసేపటి తర్వాత నీరు తాగాలని గుర్తుంచుకోవాలి. నెలకోసారి ఇవన్నీ చేస్తే పొట్ట కచ్చితంగా శుభ్రం అవుతుంది.