Best Web Hosting Provider In India 2024

పాలకూర రైస్ రెసిపీ
Palakura Rice Recipe: పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినమని వైద్యులు కూడా ప్రత్యేకంగా సూచిస్తారు. మన శరీరానికి కావాల్సిన పోషకాలు పాలకూరలో నిండి ఉంటాయి. కాబట్టి వారానికి కనీసం రెండుసార్లు పాలకూర తినడం చాలా అవసరం. అయితే పిల్లలకు ఆకుకూరలు నచ్చవు. ముఖ్యంగా పాలకూరను తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి పాలకూర రైస్ చేసి పెడితే సులువుగా తింటారు. లంచ్ బాక్స్ కు ఏదో ఒకటి పెట్టే బదులు ఇలా పాలకూర రైస్ తయారు చేసి పెట్టండి. దీని రెసిపీ కూడా చాలా సులువు. పాలకూర రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
పాలకూర రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
పాలకూర – రెండు కట్టలు
నీళ్లు – సరిపడినన్ని
కొబ్బరి పాలు – ఒక కప్పు
క్యారెట్ – ఒకటి
పచ్చి బఠానీలు – పావు కప్పు
పచ్చిమిర్చి – మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు – అర స్పూను
కరివేపాకు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
యాలకులు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు స్పూన్లు
పాలకూర రైస్ రెసిపీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
2. తర్వాత పాలకూరను సన్నగా తరిగి అందులో వేసి వేయించాలి.
3. పాలకూరలోని నీళ్లు అంతా దిగి… ఆ నీరు ఇంకిపోయి పొడిపొడిగా అయ్యేవరకు వేయించాలి.
4. అందులో క్యారెట్ ముక్కలను వేసి వేయించాలి. అలాగే ఉడికించిన బఠానీలు, కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసి కలపాలి.
5. ఇవి వేగిన తర్వాత కొబ్బరి పాలను వేసి బాగా కలపాలి.
6. ఒక కప్పు కొబ్బరి పాలు వేసాం కాబట్టి మరో కప్పు నీళ్లను వేసి మరిగించాలి.
7. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.
8. చిన్న మంటపై ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. నీళ్లు సలసలా తాగుతున్నప్పుడు బియ్యాన్ని కడిగి అందులో వేయాలి.
9. మూత పెట్టి పావుగంట సేపు వదిలేయాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.
10. పాలకూరతో చేసిన పాలకూర రైస్ రెడీ అయినట్టే.
ఇది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా పాలకూర తినని పిల్లలకు ఆకుకూరను తినిపించే మంచి ఐడియా ఇదే.