Best Web Hosting Provider In India 2024

Telangana Assembly : ‘కాళేశ్వరం’పై డైలాగ్ వార్ – విచారణ జరిపించి తీరుతామన్న మంత్రి ఉతమ్
ట్రెండింగ్ వార్తలు
కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదన్నారు చెప్పుకొచ్చారు హరీశ్ రావు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామని స్పష్టం చేశారు. అయితే మధ్యాహ్నం తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. ఇందులో కాళేశ్వరం గురించి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులో లక్ష ఎకరాల ఆయకట్టు కూడా సృష్టించలేకపోయారని విమర్శించారు.
ఉదయం హరీశ్ రావు ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా మాట్లాడారు. కాళేశ్వరాన్నిరూ. 80వేల కోట్లతో కట్టామనడం అబద్ధమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని వ్యాఖ్యానించారు. నీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చారని విమర్శించారు. కాగ్ నివేదికలు కూడా చెప్పినా… రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అడ్డగోలుగా అప్పులు చేసిందన్నారు.
సభను తప్పుదోవ పట్టించేలా హరీశ్ రావు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై తప్పులు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం అంచనా రూ. 80 వేల కోట్లు కాదన్నారు. వేల కోట్ల అప్పులను తీసుకొచ్చి… ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుటికైనా తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.భను తప్పుదోవ చెప్పటానికి హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని చెప్పే వారిపై చర్యలు తీసుకోనే అంశాలను పరిశీలించాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.