Best Web Hosting Provider In India 2024

Nara Lokesh : రాష్ట్రంలో నవశకం యుద్ధం మొదలైందని నారా లోకేశ్ అన్నారు. తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదన్నారు.
Nara Lokesh : విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన యువగళం-నవశకం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలకు ముద్దులు పెట్టి రాష్ట్రాన్ని రూ.12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్నారు. యువగళం ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమే అన్నారు. నవశకం యుద్ధం మొదలైందన్నారు. తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టేవరకు యుద్ధం ఆగదన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 50 రోజుల పాటు జైలులో పెట్టారని మండిపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
“యువగళం పాదయాత్ర నాకు ఎన్నో విషయాలు నేర్పింది. పాదయాత్రలో అడుగడుగునా ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకున్నాను. ఆడుదాం ఆంధ్ర పేరుతో సీఎం జగన్ ఓ కార్యక్రమం పెట్టారు. దీని గురించి ప్రజలను అడిగా. ఆడుదాం ఆంధ్ర కాదు జగన్ మా జీవితాలతో ఆడుతున్నారు అంటున్నారు. జగన్ కోడికత్తి వారియర్స్ పేరిట ఐపీఎల్ టీమ్ తీసుకోస్తున్నారు” – నారా లోకేశ్
జగన్ దగ్గర రెండు బటన్లు ఉన్నాయని లోకేశ్ అన్నారు. బ్లూ బటన్ నొక్కి డబ్బులు వేస్తారని, రెడ్ బడన్ నొక్కి ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేస్తారన్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టారీతిన పెంచారని మండిపడ్డారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ 100 సంక్షేమ పథకాలు కట్ చేశారని ఆరోపించారు.