Best Web Hosting Provider In India 2024

Winter Sunlight: చలికాలంలో ఎండలో ఉండటం వల్ల మామూలు సమయాల్లో కన్నా లాభాలెక్కువ. ఏ సమయంలో ఎండలో ఉంటే మంచిదో వివరాలు తెల్సుకోండి.
ఎండ అనేది మన జీవనానికి ఎంతో అవసరమైన అంశం. మనం తినే ఆహారం పండాలన్నా.. మనలో జీవ గడియారం సక్రమంగా పని చేయలన్నా, మనలో డీ విటమిన్ లోపం రాకుండా ఉండాలన్నా ఇది మనకు ఎంతగానో సహాయ పడుతుంది. అందుకనే ఉదయపు సూర్యుడి ఎండలో కాసేపైనా కూర్చోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఈ పని తప్పకుండా చేయాలని చెబుతున్నారు. ఎందుంటే
ట్రెండింగ్ వార్తలు
ఏ సమయంలో కూర్చోవాలి? ఏ సమయంలో వద్దు ?
సూర్యోదయం అయిన తర్వాత రెండు గంటల పాటు, సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు మనం ఎండలో కూర్చోవడానికి అనువైన సమయాలు. రోజుకు కనీసం అర గంట సమయం అయినా మనం ఇలాంటి ఎండలో గడపాలి. ఈ సమయాల్లో అతి నీలతోహిత కిరణాల తాకిడి నేరుగా మన మీద ఉండకుండా ఉంటుంది. అంటే మధ్యాహ్న సమయాల్లో అతినీలలోహిత కిరణాలు చాలా బలంగా ఉంటాయి. ఆ సమయంలో ఎండలో కూర్చుంటే దుష్ప్రయోజనాలూ ఉంటాయి. అలాంటి సమయంలో ఎండలోకి వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకుని బయటకు వెళ్లాలి. కాబట్టి ఉదయం, సాయంత్రం నీరెండ వేళ సూర్యుడి ఎండలో కూర్చుని ట్యాన్ అవ్వవచ్చు. ఆరోగ్య ప్రయోజనాల్ని చక్కగా పొందవచ్చు.
ఏమేం ప్రయోజనాలు ఉంటాయి?
ఎండలో ఉండటం వల్ల మన శరీరానికి డీ విటమిన్ లభిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కాల్షియం, విటమిన్ డీలు సమృద్ధిగా ఉన్నప్పుడు మన ఎముకలు బలంగా ఉంటాయి. రోజూవారీ పనులు చేసుకోవడానికి చక్కగా సహకరిస్తాయి. అయితే ఎండ వల్ల ప్రయోజనాలు ఇంతటితో సరి అనుకుంటే పొరపాటు పడినట్లేనండీ. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి.
- రోజూ కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల మనలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి సజావుగా జరుగుతుంది. అది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
- మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులకు వ్యతిరేకంగా శరీరం పోరాడటంలో సమర్థవంతంగా పని చేస్తుంది. క్యాన్సర్లలాంటి ప్రమాదకర వ్యాధులూ రాకుండా ఉంటాయి.
- చలికాలంలో ఉదయపు వాతావరణం చల్లగా ఉంటుంది. అందువల్ల మనలో రక్త ప్రసరణ వేగం నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటప్పుడు కచ్చితంగా ఎండలో కాసేపు కూర్చుంటే అది మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతాం.
- రోజూ కాసేపు సూర్య రశ్మి సమక్షంలో గడిపే వారిలో నిద్ర లేమి సమస్యలు తగ్గిపోతాయి. రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది.