Best Web Hosting Provider In India 2024

Indian student Death: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విజయవాడకు చెందిన వైద్య విద్యార్ధిని అమెరికాలో ప్రాణాలు కోల్పోయింది.
Indian student Death: ఎన్నో కలలతో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన యువతి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి కారులో ప్రయాణిస్తూ దుర్మరణం పాలైంది. ఏమి జరిగిందో తెలియక కన్న వారు తల్లడిల్లుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) నగరంలోని ఓ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీలో డిగ్రీ పూర్తి చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్లారు.
షికాగో నగరంలో బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పినట్టు తల్లిదండ్రులకు సమాచారం అందింది. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటకే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని మృతికి సంబంధించి వైద్య నివేదిక రావాల్సి ఉంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.