Best Web Hosting Provider In India 2024
Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 21వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్ పెళ్లికి పద్మావతి వాళ్లు వస్తారు. స్వప్నకు అరుణ్ కాల్ చేసి తన బిడ్డకు తానే తండ్రినని అందరికీ చెబుతానని బెదిరిస్తాడు. అరుణ్ ద్వారా కల్యాణ్ పెళ్లి ఆపేయాలని రుద్రాణి, రాహుల్ స్కెచ్ వేస్తారు.
Brahma Mudi Serial Today Episode: దుగ్గిరాల కుటుంబం అంతా రిసార్ట్‌కు వస్తుంది. రిసార్ట్ భారీదే బుక్ చేశారు అని అనామిక తండ్రి అంటే.. నా తమ్ముడు పెళ్లికి ఆమాత్రం కూడా ఉండకూడదా అని రాజ్ అంటాడు. బావగారు ఇది మీ తమ్ముడి పెళ్లి మాత్రమే కాదు. నా పెళ్లి కూడా. ఇందులో నాకు కూడా హక్కు ఉందని అనామిక అంటుంది. అప్పుడే నా కోడలు హక్కుల గురించి మాట్లాడుతుందని ధాన్యలక్ష్మీ అంటుంది.
ట్రెండింగ్ వార్తలు
కారణం మీరే కదా
ఇప్పుడు అంతా మారింది కదా. పూర్వకాలంలా పెళ్లి అయి పిల్లలు పుట్టాక కూడా భయంగా ఉండట్లేదు కదా అని ఇందిరాదేవి అంటుంది. ఎంత హక్కుల గురించి మాట్లాడినా.. అత్తింటికి వచ్చే ఆడపిల్ల కాస్తా భయంగా ఉండాలి కదా అమ్మమ్మ అని కావ్య అంటుంది. నువ్ ఎప్పుడు భయపడ్డావు. మమ్మల్ని భయపెట్టావ్ అని రుద్రాణి అంటుంది. అందుకు కారణం మీరే కదా అని కావ్య అంటుంది. రుద్రాణి నువ్ కావ్యను ఏదో ఒకటి అనకుండా ఉండలేవా అని ఇందిరాదేవి అంటుంది.
కల్యాణ్ సాఫ్ట్, అనామిక ఫైర్ బ్రాండ్. నా కొడుకు కూడా మరో ప్రకాశంలా ఉండిపోతాడేమేనని అనిపిస్తుందని ప్రకాశం అంటాడు. దీంతో అంతా నవ్వుతారు. ఇంతలో అప్పు, కనకం, కృష్ణమూర్తి వస్తారు. ఇదంతా చూస్తూ నువ్ బాధపడటం నాకు ఇష్టం లేదు. వచ్చిన ఆటోలోనే ఇంటికి వెళ్లు అని కనకం అంటుంది. కల్యాణ్ తాళి కట్టడం చూస్తేనైనా నా గుండె రాయిలా మారుతుందేమో అని అప్పు అంటుంది. ఇంతలో అప్పును చూసిన కల్యాణ్ అందరిముందుకు తీసుకొస్తాడు.
ఇరికించిన అరవింద
అప్పు నా పక్కనే తోడిపెళ్లి కొడుకులా ఉండాలి. నాకు ఎప్పుడూ వెన్నంటే ఉండి ధైర్యం చెప్పింది అంటూ గొప్పగా చెబుతాడు కల్యాణ్. అది చూసి అనామిక తల్లిదండ్రులు ఈర్శ్య పడతారు. మరోవైపు కారులో పద్మావతి, విక్రామాదిత్య, రాధమ్మా, అరవింద బయలుదేరుతారు. విక్కీ, పద్మావతి గొడవ పడినట్లున్నారు. అందుకే సైలెంట్‌గా ఉన్నారు అని అరవింద ఇరికిస్తాడు. సైలెంట్‌గా ఉంటే గొడవపడినట్లు కాదు కదా. బంధువులు చూసేందుకు వెళ్తున్నాం కదా అందుకే మౌనంగా ఉన్నాను అని పద్మావతి అంటుంది.
ఇంతలోనే అన్నయ్య అపార్థం చేసుకున్నారు అని పద్మావతి అంటుంది. అలాంటిదేం లేదని అరవింద అంటే.. అలాంటప్పుడు కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడాలి కానీ. ఇలా అంటే గొడవలు పెట్టేందుకే అన్నట్లు ఉంది. ఇంకోసారి మా అక్కను దృష్టిలో పెట్టుకుని మాట్లాడు బావా అని విక్రమాదిత్య వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో రాజ్ కాల్ చేసి ఎక్కడిదాకా వచ్చారంటూ అడుగుతాడు. ఒకరి కుటుంబం మరొకరని చూడాలని క్యూరియాసిటీగా ఉన్నట్లు చెప్పుకుంటారు.
నేనే తండ్రిని అని
మరోవైపు స్వప్నకు అరుణ్ కాల్ చేస్తాడు. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా నాతో వచ్చేయ్. లేకుంటే నేనే అక్కడికి వచ్చి గొడవ చేస్తాను అని అరుణ్ అంటాడు. రారా.. నీకోసమే ఎదురుచూస్తున్నాను అని స్వప్న అంటుంది. నేను అక్కడికి వస్తాను. కానీ నిజం చెప్పను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రిని అని చెబుతాను. అంతా నన్నే నమ్ముతారు. కాబట్టి నేను చెప్పినట్లు ఎవరికీ తెలియకుండా వచ్చేయ్ అని అరుణ్ అంటాడు.
ఇప్పుడు నేను వీడిని హ్యాండిల్ చేయలేను అని అనుకున్న స్వప్న ఈ విషయం కావ్యకు చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో పద్మావతి వాళ్లు వస్తారు. వాళ్లను దుగ్గిరాల కుటుంబం ఆహ్వానిస్తుంది. అంతా సరదాగా మాట్లాడుకుంటారు. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. వీళ్లు కూడా మీలాగే మిడిల్ క్లాస్ వాళ్లు అని రుద్రాణి అంటే.. అత్తింటి పేరు నిలబెడితే చాలు అని కౌంటర్ వేస్తుంది. దాంతో నువ్ నాకు నచ్చావే పిల్లా అని ఇందిరాదేవి అంటుంది.
స్వప్న టెన్షన్
అనంతరం పద్మావతి వాళ్లకు రూమ్స్ చూపిస్తారు. బెడ్ రూమ్ గురించి, భార్యాభర్తలు పడుకోవడం ఒకరి గురించి మరొకరు మాట్లాడుకుంటారు రాజ్-కావ్య, పద్మావతి-విక్రమాదిత్య. ఇద్దరి కాపురం సరిగా లేదని అనుకుంటారు. కానీ, తర్వాత వాళ్ల జంట బాగుందని ఒకరినొకరు బయటకు మాట్లాడుకుంటారు. మరోవైపు ఇంకా కావ్య రావట్లేదని స్వప్న టెన్షన్ పడుతుంటుంది. అది చూసి ఫోన్ వచ్చేసరికి పాప కంగారుపడుతుందని రాహుల్ అనుకుంటాడు.
ఇందాకా నీ కాల్ వచ్చినప్పటి నుంచి నీ బిహేవియర్ మారింది. ఏదైనా తప్పు చేశావా. నీ చరిత్ర అలాంటిది. నీకన్న నేను చాలా బెటర్. పెళ్లికి ముందు నా డబ్బు చూశావ్. ఇప్పుడు డబ్బు లేదని తప్పు పడుతున్నావ్ అని రాహుల్ అంటాడు. ప్రేమిస్తే తప్పులన్నీ వదిలేస్తాం అని స్వప్న అంటుంది. ఇంతలో రుద్రాణి వచ్చి ఏమంటుంది నీ పెళ్లాం అంటుంది. కంగారు పడుతుంది. కావ్యకు చెబితే మాత్రం ప్లాన్ రివర్స్ అవుతుందని రాహుల్ అంటాడు.
ట్రైన్ చేయాలి
దీనికున్న పొగరుకు చెప్పదు. కావ్య చెప్పినట్లు వింటే ఇది అందరికీ నచ్చేది. ఈ పెళ్లి ఆగిపోవాలి. అందుకు కారణం స్వప్న అని తెలిసి.. ఇంట్లో నుంచి గెంటేయాలి. అరుణ్‌కు కాల్ చేసి రిసార్ట్‌కు రమ్మను అని రుద్రాణి అంటుంది. మరోవైపు కల్యాణ్, అప్పు మాట్లాడుకుంటారు. డాడీకి అప్పు ఇచ్చినవాడు పెళ్లిలో గొడవ చేస్తాడేమో. ముందే కల్యాణ్‌ను ట్రైన్ చేయాలని అనామిక అనుకుంటుంది. కల్యాణ్ గదిలోకి వెళ్లే సరికి అప్పు ఉండటం చూసి షాక్ అవుతుంది.
ఇలా పెళ్లి కాకముందు పెళ్లికొడుకు గదిలోకి రాకూడదు కదా అని కల్యాణ్ అంటే.. నీతో పర్సనల్‌గా మాట్లాడదమంటే ఎప్పుడు ఎవరో ఒకరు అడ్డుగా ఉంటున్నారు అని అనామిక అంటుంది. దీంతో నేను పోతున్న అని అప్పు వెళ్లిపోతుంది. అప్పును ఆపి డోర్ పెట్టి కాపాల ఉండమంటుంది అనామిక.