Nagarjuna: నాగార్జునను అరెస్ట్ చేయండి.. హైకోర్టులో న్యాయవాది పిటిషన్.. బాధ్యులు మీరేనంటూ!

Bigg Boss HRC: బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన విధ్వంసంపై పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌పై రెండు కేసులు నమోదు కాగా బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ కారణంగా గొడవలు జరిగినట్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు (Telangana State Human Rights Commission) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. “బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఎక్కడ నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరు కూడా చేర్చాలి. ఆయన కూడా ఈ గొడవలకు బాధ్యులే” అని అరుణ్ తెలిపారు.

“అంత గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి” అని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేశారు. దీంతో ఈ టాపిక్ మరింత హాట్‌గా మారింది.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత పల్లవి ప్రశాంత్‌ను మరో మార్గం నుంచి సీక్రెట్‌గా పోలీసులు బయటకు తీసుకెళ్లారు. మళ్లీ అక్కడికి రాకూడదని పోలీసులు, బిగ్ బాస్ నిర్వహాకులు ఆదేశించారు. కానీ, వాటిని బేఖాతరు చేస్తూ పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ జీప్‌లో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చాడు. దీంతో అక్కడ గొడవలు జరగడానికి కారణం అయ్యాడు.

ఈ క్రమంలోనే రన్నరప్ అమర్ దీప్ చౌదరి, కంటెస్టెంట్ అశ్విని, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ కార్లపై దాడులు జరిగాయి. వారి కార్ల అద్దాలు పగిలాయి. ఈ విషయమై గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేసింది. అనంతరం ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. సుమోటోగా పోలీసులు కేసు తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *