Periods Delaying: పీరియడ్స్‌ను ఆలస్యం చేసే టాబ్లెట్స్ వేసుకోవడం మంచిదేనా? ఎవరు వేసుకోకూడదు?

Best Web Hosting Provider In India 2024

Periods Delaying: శుభకార్యం ఉందనో లేక ప్రయాణం చేయాలనో ఎక్కువ మంది మహిళలు పీరియడ్స్‌ను వాయిదా వేసే మాత్రలను వేసుకుంటూ ఉంటారు. మరికొందరు పీరియడ్స్ త్వరగా వచ్చేందుకు కూడా మాత్రలు వేసుకుంటారు. ఇవి హార్మోన్ మాత్రలు. వీటిని ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్స్ అని పిలుస్తారు. అలాగే ఈస్ట్రోజెన్ – ప్రొజెస్టరాన్ కలిపిన ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. వీటిలో ప్రొజెస్టరాన్ పిల్స్‌ని పీరియడ్స్‌ను వాయిదా వేయడానికి వాడుతూ ఉంటారు. ఇక ఈస్ట్రోజన్ -ప్రొజెస్టరాన్ రెండు కలిపిన మాత్రలను గర్భం రాకుండా ఉండేందుకు వినియోగిస్తూ ఉంటారు. ఈ రెండింటినీ అధికంగా వాడడం ప్రమాదకరమే.

 

ట్రెండింగ్ వార్తలు

పీరియడ్స్ వాయిదా

నెలసరిని ముందుగా వచ్చేలా చేసేందుకు లేదా వాయిదా వేసేందుకు ప్రొజెస్టరాన్ హార్మోన్ నిండిన మాత్రలను వైద్యులు సూచిస్తారు. వీటిని రోజుకి మూడుసార్లు వేయమని చెబుతారు. అలా మూడు రోజుల నుంచి పది రోజుల వరకు వాడమని చెబుతారు. అవి ఆపేసిన వెంటనే ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చేయొచ్చు.

వీళ్లు దూరంగా ఉండాలి

ఎవరు పడితే వారు ఈ టాబ్లెట్స్‌ను వాడకూడదు. కాలేయ సమస్యలు, గుండె సమస్యలు, రక్తం గడ్డకట్టే రోగాలు ఉన్నవారు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు, మధుమేహంతో ఉన్నవారు, బీపీ సమస్యలు ఉన్నవారు, అలాగే పాలిచ్చే తల్లులు… ఈ హార్మోన్ల ట్యాబ్లెట్లకు దూరంగా ఉండాలి. అవి వారికి మరిన్ని సమస్యలను తెచ్చిపడతాయి.

మన శరీరంలో ఏ చర్య జరగాలన్నా అందుకు మెదడు నుంచి సంకేతాలు రావాలి. ముఖ్యంగా రుతుక్రమం ప్రారంభం అవ్వడానికి మెదడులోని హైపోథాలమస్ గ్రంధి ముఖ్యమైనది. హైపోతాలమస్ గ్రంథి నుంచి, పిట్యూటరీ గ్రంథి నుంచి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు నేరుగా అండాశయం మీద ప్రభావం చూపిస్తాయి. అండాశయంలో ఎదిగిన అండం అక్కడి నుంచి విడుదలవుతుంది. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా జరిగితే అండం, వీర్యకణంతో కలిసి గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. వీర్యకణంతో కలవని అండం నెలసరి సమయంలో బయటకు వచ్చేస్తుంది.

 

టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

ఎప్పుడైతే నెలసరిని వాయిదా వేయాలని ప్రొజెస్టరాన్ టాబ్లెట్లను వేసుకుంటారో… అప్పుడు మెదడు మీద ఆ ప్రభావం పడుతుంది. అండం ఎదుగుదలకి, విడుదలకి అవసరమైన హార్మోన్లు ఉత్పత్తి కాకుండా అక్కడే ఆపుతుంది. దీనివల్ల నెలసరి ఆగుతుంది. ఈ మాత్రలను ఎప్పుడో అరుదుగా వేసుకుంటే ఫర్వాలేదు, కానీ తరచూ వాడడం మంచిది కాదు.

తరచూ ఈ ప్రొజెస్టరాన్ టాబ్లెట్లను నెలసరి వాయిదా వేయడానికి వాడితే హార్మోన్లు అసమతుల్యత ఏర్పడవచ్చు. ఇది మరింత ప్రమాదకరం. పదేపదే నెలసరిని సమయానికి రాకుండా వాయిదా వేయడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా పిల్లలు కనే వయసులో ఉన్న వారు, యుక్త వయసులో ఉన్నవారు… ఇలాంటి పనులు చేయడం వల్ల గర్భం ధరించడం చాలా కష్టంగా మారుతుంది. గర్భధారణ సమయంలో ఇతర సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి నెలసరిని వాయిదా వేసే ఆలోచనలను మార్చుకోవాలి.

WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *